Moviesసౌందర్య తర్వాత వెంకీ అంటే ఆ హీరోయిన్‌కి ఆరాటమెక్కువ..?

సౌందర్య తర్వాత వెంకీ అంటే ఆ హీరోయిన్‌కి ఆరాటమెక్కువ..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ అంటే అన్నీ వర్గాల ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ ఉంది. ఎక్కువగా తమిళం తో పాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తుండటం వల్ల వెంకీకి అటు తమిళం అలాగే మిగతా సౌత్ భాషలలో కూడా ఆయనకి అభిమానులు ఎక్కువే. వెంకీ చేసే సినిమాలలో ఎక్కువగా సూపర్ హిట్స్ ఉంటున్న సంగతి తెలిసిందే.

అందుకే, ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలే కాదు క్రేజ్ కోసం హీరోయిన్స్ కూడా తెగ ఆరాటపడుతుంటారు. ఎక్కువ్వగా వెంకీతో స్క్రీన్ షేర్ చుసుకుందీ అంటే సౌందర్య అని చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచాయి. హిట్ పేయిర్ అనే పేరు కూడా ఉంది. ఆ తర్వాత వెంకీ సరసన సిమ్రాన్ బాగా పాపులర్ అయింది.

 

ఇక వీరిద్దరి తర్వాత వెంకీతో కలిసి నటించాలనే ఆరాటం ఎక్కువగా తమిళ కుట్టీ త్రిష కృష్ణన్‌కి ఉండేది. వీరి కాంబినేషన్‌లో నమో వేంకటేశ, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వెంకీ పక్కన త్రిష పర్‌ఫెక్ట్ పేయిర్ అని చెప్పుకున్నారు. ఇప్పటికీ త్రిషలో తరగని అందం సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు ఉన్నాయి. 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది.

ఇంకా త్రిషలో అదే ఛార్మ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వెంకీ సరసన నటించాలని ఈ బక్క పలచని భామ ఎదురుచూస్తోంది. ప్రియమణి, మీనా, శ్రీయ శరణ్‌లకి అవకాశాలిచ్చిన వెంకటేష్ మరోసారి త్రిషకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. త్రిష లేటెస్ట్ ఫొటో షూట్స్ చూస్తే కుర్ర హీరోలకి సరిపోయే ఫిజిక్కే అనుకోవచ్చు. కాబట్టి ఏ హీరో అయినా త్రిషతో రొమాన్స్ చెయవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news