Moviesఆ హీరో కోసం అమ్మాయిలే హోటల్ బుక్ చేసేవారా... ఆ అమ్మ‌యిల...

ఆ హీరో కోసం అమ్మాయిలే హోటల్ బుక్ చేసేవారా… ఆ అమ్మ‌యిల మోజులోనే కెరీర్ కొలాప్స్‌..!

ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. కెరీర్ పరంగా ఎదిగే సమయంలో తప్పులు చేస్తే మాత్రం ఆ తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎంతోమంది సెలబ్రిటీలు స్టార్ స్టేటస్ ను పొందినా చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలబ్రిటీల వారసులలో కొందరు ప్రస్తుతం దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. చివరి రోజుల్లో ఇబ్బందులు పడి వార్తల్లో నిలిచిన వాళ్లలో ప్రముఖ నటుడు హరనాథ్ ఒకరు.

తొలి తెలుగు అందాల హీరోగా పేరు తెచ్చుకున్న హరనాథ్ మద్యానికి బానిసై కెరీర్ ను నాశనం చేసుకున్నారని చాలామంది భావిస్తారు. ఓ ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో హరనాథ్ గురించి మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ వెల్లడించారు. హరనాథ్ రాజుల కుటుంబానికి చెందినవారని కాకినాడలో హరనాథ్ స్టూడెంట్స్ కు సమస్య వస్తే ఉల్లిపాయ బాంబులు విసిరారని ఆయన చెప్పుకొచ్చారు. తనతో పాటు ఉండే ప్రతి ఒక్కరికీ హరనాథ్ డబ్బు ఖర్చు చేసేవారని ప్రముఖ జర్నలిస్ట్ కామెంట్లు చేశారు.

హరనాథ్ ఏరోజు వచ్చిన డబ్బును ఆరోజే ఖర్చు చేసేవారని సమాచారం. మద్రాస్ లోని అయ్యంగార్ లేడీస్ ఖరీదైన హోటల్ రూమ్స్ ను బుక్ చేసి కార్లలో వచ్చి హరనాథ్ ను బలవంతంగా హోటల్ రూమ్ కు తీసుకెళ్లేవారని తెలుస్తోంది. అప్పట్లోనే హరనాథ్ కు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ రీజన్ వల్లే తన సినిమాలో హరనాథ్ నటించే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మద్యం తాగకూడదని, మాంసం తినకూడదని, అమ్మాయిలతో ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధనలు విధించారట.

మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో హీరోగా హరనాథ్ కెరీర్ మొదలైంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత హరనాథ్ అని అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేది. అయితే కొంతమంది హీరోలు హరనాథ్ ను తొక్కేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆయన తాగుబోతు కాకపోయినా కొంతమంది ఆ ముద్ర వేశారని తెలుస్తోంది. ఎవరైనా డబ్బులు ఇచ్చినా హరనాథ్ ఎక్కువ డబ్బులు తీసుకునేవారు కాదని సమాచారం. విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పడానికి హరనాథ్ జీవితం సాక్ష్యమని చెప్పవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news