Moviesక‌మ‌ల్‌హాస‌న్ - సారిక జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్‌... ఆమె వ‌ల్లే...

క‌మ‌ల్‌హాస‌న్ – సారిక జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్‌… ఆమె వ‌ల్లే విడాకులు….!

కమల్ హాసన్ ఈ పేరుకు అమ్మాయిల జీవితాలకు ఒక విడదీయాలని బంధం ఉంటుంది. తుమ్మెద వెళ్లి పువ్వుపై వాలినట్టుగా కమల్ హాసన్ మనసు ఎప్పుడు కొత్త కొత్త అమ్మాయిలపై పడుతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు. నటి శ్రీవిద్య, శ్రీప్రియ, వాణి గణపతి, సారిక, సిమ్రాన్, గౌతమి, పూజ కుమార్ .. ఇలా ఇక్కడ లిస్ట్ ఆగిపోతుంది అనుకుంటే అది మన పొరపాటు. పెళ్లి అనే వ్యవస్థను తాను నమ్మను అంటూ ఎన్నోసార్లు మీడియా ముందు కమిట్ అయ్యాడు కమల్.

అది తన నైజం. దాన్ని మనం తప్పు పెట్టడమే పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే తన నేచర్ కమల్ హాసన్ ఎప్పుడు దాచుకోలేదు. తన జీవితం ఒక తెరిచినా పుస్తకం అని చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా అతడిది నిజమైన ప్రేమ అని నమ్మి ప్రేమలో పడుతున్న వారే నిజంగా తప్పు చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ తన కన్నా వయసులో పెద్ద అయిన‌ శ్రీవిద్యతో ప్రేమాయణం నడిపి ఆమెను మోసం చేసి శ్రీప్రియ తో లవ్వాయణం నెరిపాడు. వీరిద్దరూ అతడితో కొన్నాళ్ళు సహజీవనం చేసిన కూడా పెళ్లి వరకు ఆ బంధాన్ని వెళ్లనివ్వలేదు. అతడికి ఆ ఇంట్రెస్ట్ లేదు.

కానీ ఆ తర్వాత సన్న జాజి తీగ లాంటి వాణి గణపతి తో కూడా సహజీవనం అనే డ్రామా చేస్తే ఆమె అందుకు ససేమీరా అంది. పెళ్లికి ముందు అలాంటి వేషాలు కుదరవు అని గట్టిగా చెప్పడంతో పెళ్లి బంధం తప్పలేకపోయింది. ఎలాగోలా పెళ్లి చేసుకున్న పిల్లలను కనే ఆలోచన అతగాడికి లేదు. పదేళ్ల పాటు కాపురం చేసిన సంతానం లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక సారిక అతడి మాయలో పడే వరకు వాణితో బంధం బాగానే ఉండేది. ఎప్పుడైతే సారిక అతగాడి మాయలో పడిందో ఇక వాణి గణపతి తో బంధానికి నూకలు చెల్లాయి.

ఆ తర్వాత సారిక తో ఏకంగా 17 ఏళ్ళ పాటు పెళ్లి బంధంలో కొనసాగిన కమల్ అందులో 12 ఏళ్ళు మాత్రమే కలిసి ఉన్నాడు. ఆ తర్వాత పిల్లల కోసం కొన్నాళ్ళు కలిసి ఉన్న ఆ తర్వాత ఆ విడాకులు తీసుకొని విడిపోయారు. సారిక విడాకులు తీసుకోవడానికి మాత్రం ప్రధాన కారణం సిమ్రాన్. కమల్ హాసన్ సిమ్రాన్ తో క్లోజ్ గా ఉంటున్నాడు అనే వార్తలు కోలీవుడ్ లో బాగా చక్కర్లు కొట్టాయి. అది నిజమైన కూడా ఇద్దరు బయటకు అఫీషియల్ గా ఒప్పుకోలేదు. కానీ సారిక మాత్రం కమల్ ని నిలదీసింది. అతడి కోసం ఏకంగా కెరీర్ త్యాగం చేసి చెన్నై కి వచ్చేసింది. ఆమె అన్ని వదిలేసుకొని వచ్చిన కమల్ ఆమెకు సరైన గౌరవం మాత్రం ఇవ్వలేదు.

సిమ్రాన్ వచ్చే వరకు అంత బాగానే ఉన్నా కూడా సారిక ఆ నిజాన్ని అంగీకరించలేకపోయింది. కమల్ ని నిలదీసింది…తనకు అన్యాయం చేయద్దు అంటూ గట్టిగా అడిగింది. వాస్తవం అర్ధం అయ్యే సరికి ఆమె చేతిలో ఏమి లేకుండా పోయింది. అప్పటికే కమల్ సిమ్రాన్ తో రిలేషన్ లోకి వెళ్ళిపోయాడు.ఇక సారిక చివరి ప్రయత్నంగా కమల్ ని ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది కూడా. అది కూడా నిజం చేయాలనీ ఒక రోజు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఆ ప్రమాదంలో ఆమె స్పైనల్ కార్డ్ బాగా డ్యామేజ్ అయ్యింది. మంచం పైన మూడు నెలల పాటు ఉండాల్సి వచ్చింది.

అయినా కూడా కమల్ హాసన్ లో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఇక జీవితం ఏంటో అర్ధం అయినా సారిక 2004 లో కమల్ నుంచి విడాకులు పొందింది. అంతకు ముందు నాలుగేళ్లు వారు విడిగానే ఉన్నారు. ఇక 2000 సంవత్సరంలో సిమ్రాన్ – కమల్ ప్రయాణం మొదలయ్యింది. మూడేళ్ళ కాలంలో మూడు సినిమాల్లో నటించి బాగానే ఎంజాయ్ చేసారు. కానీ సిమ్రాన్ కి అప్పటికే రియాలిటీ అర్ధం అయ్యి కమల్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news