Moviesగోపిచంద్ హీరోయిన్‌కు స్టార్ న‌టుడు న‌ర‌కం చూపించాడా...!

గోపిచంద్ హీరోయిన్‌కు స్టార్ న‌టుడు న‌ర‌కం చూపించాడా…!

ఒంటరి సినిమా లో గోపీచంద్ కు జోడిగా నటించిన భావన ఆ సినిమా తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. నిజానికి భావన. మలయాళ ఇండస్ట్రీ ద్వారా చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యింది. మలయాళం లో చాలా సినిమాలలో నటించింది. ఒక ఒంటరి సినిమా ఆశించిన మేర హిట్ అవ్వకపోవడం తో భావన కు కూడా పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మా సినిమా తో భావన కు మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా టాలీవుడ్ మంచి విజయం సాధించింది. ఆ తరవాత మలయాళం, తెలుగు తో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో సైతం నటించింది. అయితే సొంత గడ్డ మలయాళ ఇండస్ట్రీ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న సమయం లో భావన పై లైంగిక దాడి జరగడం ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. అంతే కాకుండా లైంగిక దాడి ఘటన భావన కెరీర్ ను తల కిందులు చేసింది.

ఇక భావన పై లైంగిక దాడి చేసింది మరెవరో కాదు..మలయాళ నటుడు దిలీప్ కుమార్ ఈ పని చేయించాడు. కొంతమంది దుండగులకు డబ్బులు ఇచ్చి మరీ దిలీప్ కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 2017 ఫిబ్రవరి లో ఈ దారుణం చేసుకుంది. ఈ ఘటన జరిగిన నాటి నుండి భావన భయట ప్రపంచానికే దూరం అయ్యారు. అంతే కాకుండా ఇంటి నుండి బయటకు రావడానికే భయపడింది.

చాలా కాలం వరకు అసలు ఇంట్లో నుండి అడుగు భయట పెట్టలేదు. చాలా కాలం తరవాత మళ్ళీ సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆ సమయం లో కూడా భావన పై మీడియా లో సెటైర్ లు వేయడం మానలేదు. భావన డ్రెస్ ల పై సైతం వ్యంగ్యంగా కామెంట్స్ చేసేవారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న భావన అప్పట్లో పోలీసులను సైతం ఆశ్రయించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news