Moviesవారెవ్వ..ఫైనల్లీ..అనుకున్నది సాధించిన సాయి పల్లవి..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

వారెవ్వ..ఫైనల్లీ..అనుకున్నది సాధించిన సాయి పల్లవి..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి ..తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకి సైన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.మల్లర్ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమా తెలుగు లో తన నటనను జనాలకు రుచి చూపించింది. ఈ క్రమంలోనే మలర్ సినిమా, ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సాయి పల్లవి పేరు సినిమా ఇండస్ట్రీలో రేంజ్ లో వైరల్ గా మారింది .

ఇక తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రాధాన్యమిస్తూ సాయి పల్లవి సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ జనాలకు విపరీతంగా నచ్చింది .అందుకే ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేశారు సాయి పల్లవి . కాగా ఆమె లాస్ట్ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని సాయి పల్లవి డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . అంతే కాదు గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి సాయి పల్లవి దూరంగా ఉంది. తన గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని సాయి పల్లవి కి సంబంధించిన క్రేజీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలలోనే కనిపించిన సాయి పల్లవి ఇకపై బాలీవుడ్ లో కూడా కనిపించనున్నట్లు ఈ న్యూస్ ఆధారంగా తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమాలో ఆయనకు హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇంతకుముందు సీత పాత్ర కోసం దీపికా పదుకొనే, కరీనాకపూర్ ల పేర్లు వినిపించగా ఇప్పుడు వాళ్ళందరూ ఫెడవుట్ అయిపోయారని యంగ్ బ్యూటీ కోసం నాచురల్ లుక్స్ కోసం ట్రై చేస్తున్నారని ..ఈ క్రమంలోని సాయి పల్లవి ఈ పాత్రకు సూపర్ గా ఉంటుందని రణబీర్ కపూర్ స్వయానా ఆ పేరు సజిస్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా సరే సాయి పల్లవి గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే ట్రెడిషనల్ పాత్రలను సాధించుకుంటుంది . ఒకవేళ ఇది నిజంగా నిజం అయితే మాత్రం సాయి పల్లవి అభిమానులకు పండగనే చెప్పాలి . బాలీవుడ్ అంటేనే ఎక్స్పోజింగ్ కానీ అక్కడ కూడా పద్ధతిగా చీర కట్టుకొని అవకాశాలు సంపాదించుకున్న మొదటి హీరోయిన్గా సాయి పల్లవి రికార్డు నెలకొల్పబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news