Moviesఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌ను ఫిక్స్ చేసిన కొర‌టాల‌... ఫ్యాన్స్‌ను...

ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌ను ఫిక్స్ చేసిన కొర‌టాల‌… ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేంగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా స్టార్ హీరో అయిపోయాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్‌కు ఇండియా ఎల్ల‌లు దాటించేసేంత ఇమేజ్ తెచ్చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో ఆస‌క్తి రేపుతున్నాయి.

ముందుగా ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమా ఆ వెంట‌నే కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తున్న‌వే. ఇక త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఇప్ప‌టికే ఆరు నెల‌లు దాటిపోయింది. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందా ? అని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు.. తెలుగు సినీ అభిమానులు అంద‌రూ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు సంక్రాంతికి ముందుగానే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. భారీ యాక్ష‌న్ డ్రామాగా కొర‌టాల ఈ సినిమాను ప్లాన్ చేశారు. ఇక లేటెస్ట్ అప్‌డేట్ సినిమాపై మ‌రింత హైప్ పెంచేలా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించే ఇద్ద‌రు హీరోయిన్ల‌ను కొర‌టాల ఫైన‌ల్ చేసేశాడు. ఒక‌రు దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్‌.

జాన్వీ – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుంద‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. అది ఇప్పుడు ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతోంది. ఇక రెండో హీరోయిన్‌గా ఇప్పుడు టాలీవుడ్‌ను త‌న అంద‌చందాల‌తో ఊపేస్తోన్న శ్రీలీల ఫైన‌ల్ అయ్యింద‌ట‌. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎన్టీఆర్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అంటే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల పేర్లు ఫైన‌ల్ కావ‌డంతో తార‌క్ ఫ్యాన్స్ ర‌చ్చ ను ఆపేలా లేరు.

ఇక యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ‌చ్చే యేడాది ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news