Moviesమహేశ్ సినిమాలో సెక్సీ భామ..రూల్స్ బ్రేక్ చేసి మరీ ఆ బ్యూటీ...

మహేశ్ సినిమాలో సెక్సీ భామ..రూల్స్ బ్రేక్ చేసి మరీ ఆ బ్యూటీ ని బుక్ చేసుకున్న త్రివిక్రమ్..!?

ప్రజెంట్ ఘట్టమనేని ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న సినిమానే ఇది . ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది .

కాగా సెకండ్ టైం ఈ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేయబోతుంది పూజ హెగ్డే . ఆమె కాళ్ల గాయం వల్ల షూటింగ్ కి అటెండ్ కాలేకపోతుందని.. త్వరలోనే షూటింగ్ కి అటెండ్ అవుతుందని తెలుస్తుంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాస్టర్ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా బ్యూటీస్ టబు, రాణి ముఖర్జీ ఈ సినిమాలో భాగం చేయనున్నారట త్రివిక్రమ్.

మహేష్ బాబు పై మోజు పడే పాత్రలో టబుని కాంట్రవర్షియల్ కంటెంట్ లో చూపించబోతున్నాడని తెలుస్తుంది . అంతేకాదు రాణి ముఖర్జీ సైతం కీలక పాత్రలో కనిపించబోతుందని ..ఇలా ఇద్దరు బాలీవుడ్ బడా స్టార్స్ ను మహేష్ సినిమాలో భాగం చేయడం ఫాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . అంతేకాదు త్రివిక్రమ్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీర్చిదిద్దబోతున్నాడని అందుకే ఆ రేంజ్ నటులను సినిమాలో ఎంపిక చేసుకుంటున్నాడు అన్న న్యూస్ వైరల్గా మారింది .

ఏది ఏమైనా సరే సినిమాలో ఇద్దరు హాట్ ముద్దుగుమ్మలు ఉంటున్నారు అని తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాసరావు తన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఏ నాడు పెట్టడు. ప్రదర్శించడు. కానీ ఫస్ట్ టైం తన రూల్స్ ని బ్రేక్ చేసి మరి అలాంటి సీన్స్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో ..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news