Moviesచరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలియగానే..ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా.. ఇదే...

చరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలియగానే..ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా.. ఇదే కదా ఫ్రెండ్ షిప్ అంటే..!!

ప్రజెంట్ మెగా ఫాన్స్ ఎంత ఫుల్ ఖుషి గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పదేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన బిగ్ హ్యాపీ మూమెంట్ ఎట్టకేలకు వచ్చేసింది . మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు . ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు . తన ముద్దుల కోడలు గర్భం దాల్చినట్టు చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతు ఉపాసన పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు .

పెద్దవారు సైతం మెగా కోడలు ఉపాసనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న సినీ స్టార్స్.. మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ కు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు . అయితే అందరికన్నా ఎక్కువగా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సంతోషపడినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో రాంచరణ్ – తారక్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం. రీసెంట్ గానే వాళ్ళిద్దరూ కలిసి ఏకంగా బిగ్గెస్ట్ మల్టీ స్టార్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు . ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తారక్ – చరణ్ మాట్లాడుతూ మన మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే తారక్ ఇండియాలో లేకపోయినా సరే తనకు పుట్టింటి తరపున..తానే అన్నలా భావించి పసుపు కుంకుమలు చీరా సారే పంపించారట . ఉపాసనకు ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ ని.. కడుపుతో ఉన్నప్పుడు ఆడపిల్లకి ఇవ్వాల్సిన అన్ని వస్తువులను.. ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఉపాసన కోసం కొన్ని పంపించారట .

ఈ క్రమంలో నే గిఫ్ట్ అందుకున్న చరణ్-ఉపాసన చాలా ఎమోషనల్ అయ్యారట. మెగాస్టార్ చిరంజీవి సైతం తారక్ కి ఫోన్ చేసి మరి స్పెషల్ థాంక్స్ చెప్పారని తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఒకే అమ్మ కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ములు లా తారక్ – చరణ్ కలిసి ఉండడం మెగా నందమూరి ఫ్యాన్స్ కు హ్యాపీనెస్ ఇస్తుంది. మరోసారి వీళ్ళిద్దరూ కలిసి తెర పై కనిపించాలని కోరుకుంటున్నారు మెగా నందమూరి ఫ్యాన్స్ . చూడాలి మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?

Latest news