Moviesత్రివిక్ర‌మ్‌పై మ‌హేష్ కారాలు మిరియాలు.. దెబ్బ‌తో ప‌వ‌న్‌కు హ్యాండ్ ఇచ్చాడుగా...!

త్రివిక్ర‌మ్‌పై మ‌హేష్ కారాలు మిరియాలు.. దెబ్బ‌తో ప‌వ‌న్‌కు హ్యాండ్ ఇచ్చాడుగా…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు విష‌యంలోకి వెళితే బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలోకి ప‌వ‌న్ ఎంట‌ర్ కావ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. అయితే ఈ షోకు ప‌వ‌న్‌తో క‌లిసి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ వ‌స్తారనే అంద‌రూ ఊహించారు. గ‌తంలో కూడా ఈ షో నుంచి బాల‌య్య త్రివిక్ర‌మ్‌కు ఫోన్ చేసిన‌ప్పుడు మీరు ఈ షోకు ఎవ‌రితో రావాలో తెలుసుగా ? అన్న ప్ర‌శ్న వేసిన‌ప్పుడే ప‌వ‌న్ వ‌స్తే త‌ప్ప‌కుండా త్రివిక్ర‌మ్ వ‌స్తాడ‌ని అంద‌రికి తెలిసిపోయింది.

ఇప్పుడు ప‌వ‌న్ షోలోకి ఎంట్రీ ఈ నెల 27న ఉండ‌నుంది. అయితే ప‌వ‌న్‌కు జంట‌గా త్రివిక్ర‌మ్ రావ‌ట్లేదు అన్న‌ది క‌న్‌ఫార్మ్ అయ్యింద‌ని టాక్ ? ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌వ‌న్‌తో పాటు వ‌స్తున్నాడ‌ట‌. ఈ ఎపిసోడ్‌కు త్రివిక్ర‌మ్ రాక‌పోవ‌డానికి కార‌ణం మ‌హేష్ అని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో త్రివిక్ర‌మ్ అంతా ప‌వ‌న్ సినిమాల మీదే ఉంటున్నాడు.

ప‌వ‌న్ సినిమాల‌కు స్క్రిఫ్ట్‌లు రాయ‌డం, స్క్రీన్ ప్లేలు, మాటలు రాయ‌డంతోనే స‌రిపెట్టేస్తున్నాడు. అందుకే మ‌హేష్ సినిమా సెకండాఫ్ కూడా స‌రిగా న‌చ్చ‌కే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు ఎక్క‌లేద‌న్న టాక్ కూడా ఉంది. మ‌హేష్ కూడా త్రివిక్ర‌మ్‌పై సీరియ‌స్‌గా గ‌రం గ‌రం లాడ‌డంతోనే త్రివిక్ర‌మ్ బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు తాను డుమ్మా కొట్టేసి క్రిష్‌ను సెట్ చేసిన‌ట్టు భోగ‌ట్టా ?

ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మ‌హేష్ సినిమా ఆల‌స్యం అవుతోంది. ఇప్పుడు బాల‌య్య షోకు వెళితే మ‌హేష్ సైడ్ నుంచి ఏం త‌ల‌కాయ నొప్పి వ‌స్తుందో అన్న సందేహంతోనే తెలివిగా క్రిష్‌ను పంపించేశాడంటున్నారు. క్రిష్‌ను త‌న‌తో ఈ షోకు తీసుకు వెళ్లేందుకు ప‌వ‌న్ కూడా ఓకే అన్నారంటే ప‌వ‌న్‌పై త్రివిక్ర‌మ్ ప్ర‌భావం ఎంత‌లా ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఇక క్రిష్ కూడా బాల‌య్య‌కు కావాల్సినోడే. శాత‌క‌ర్ణి లాంటి 100వ సినిమాను సూప‌ర్ హిట్ చేశాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు అంచ‌నాలు అందుకోక‌పోయినా.. ఆ సినిమా టైంలోనే రాజ‌కీయ కోణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ప‌వ‌న్ – క్రిష్ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ స‌రికొత్త సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news