Moviesచిరంజీవి తాత ఊళ్లో అంద‌రిని బూతులు తిట్ట‌డంతో ఆయ‌న‌కు ఏం పేరు...

చిరంజీవి తాత ఊళ్లో అంద‌రిని బూతులు తిట్ట‌డంతో ఆయ‌న‌కు ఏం పేరు పెట్టారంటే..!

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు టాలీవుడ్ లోని తిరిగి లేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు. మొగల్తూరులో ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన చిరంజీవి ఈ రోజు తెలుగు ప్రజల హృదయాల్లో తిరుగులేని మెగాస్టార్ గా నిలిచిపోయారు. చిరంజీవి స్వస్థలం.. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరు కావటం విశేషం.

గతంలో కృష్ణంరాజు నాన్న, తాతలు అటు చిరంజీవి నాన్న,తాతలకు సన్నిహిత సంబంధాలు ఉండేవట. అయితే చిరంజీవి కంటే ముందుగానే కృష్ణంరాజు హీరో అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి కూడా సినిమాల్లోకి వచ్చి తిరుగులేని మెగాస్టార్ అయ్యారు. చిన్నప్పుడు చిరంజీవి తాత మొగల్తూరులో కనిపించిన వాళ్ళందరినీ ఎక్కువగా బూతులు తిట్టేవారట. సమయం.. సందర్భం లేకుండా బూతులు తిడుతూ ఉండడంతో చిరంజీవి తాతకు బూతుల నాయుడు గారు అని పేరు ఉండేదట.

ఊళ్ళో వాళ్ళందరూ బూతులు నాయుడు బూతులు నాయుడు అని చిరంజీవి తాత‌ను ఆటపట్టించే వారట. ఈ విషయాన్ని దివంగత కృష్ణంరాజు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇక చిరంజీవి తాత అప్ప‌ట్లోనే ఓ చిన్న ప్ర‌భుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయ‌న‌కు కృష్ణంరాజు వాళ్లే మొగ‌ల్తూరు సంత‌లో చిన్న కొట్టు కేటాయించార‌ట‌. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు వెంక‌ట్రావు కానిస్టేబుల్ అయ్యారు.

ఇక ఆ వెంక‌ట్రావు కుమారులే మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. చిరంజీవి, కృష్ణంరాజు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సొంత ఊరు మొగ‌ల్తూరు అంటే వీరికి ఎంతో ప్రేమ ఉండేది. మొగ‌ల్తూరు వాళ్లు అంటే వీరిద్ద‌రు ఎంతో ఇష్ట‌ప‌డేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news