Moviesబాల‌య్య బావ‌మ‌నోభావాలు Vs చిరు బాస్ పార్టీ.. ఏది హిట్‌.. ...

బాల‌య్య బావ‌మ‌నోభావాలు Vs చిరు బాస్ పార్టీ.. ఏది హిట్‌.. ఏది ఫ‌ట్‌…!

భారీ భారీ అంచ‌నాల‌తో బాల‌య్య వీరసింహారెడ్డి సినిమా నుంచి స్పెషల్ సాంగ్ మా బావ మనోభావాలు వ‌చ్చేసింది. ఇక ఇప్ప‌టికే చిరు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి స్పెష‌ల్ సాంగ్‌ బాస్ పార్టీ వ‌చ్చేసింది. రెండు పాట‌లు కూడా వేటిక‌వే స్పెషాలిటీతో మెప్పిస్తున్నాయి. ఇక స‌హ‌జంగానే ఇద్ద‌రు హీరోల అభిమానులు త‌మ హీరో స్పెష‌ల్ సాంగ్ అదిరిపోయింద‌ని హంగామా మొద‌లు పెట్టేశారు.

అస‌లు ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తి విష‌యంలోనూ కంపేరిజ‌న్ వ‌స్తోంది. ఫైన‌ల్‌గా ఎవ‌రి సినిమా పై చేయి సాధిస్తుంది. ఈ పోరులో బాల‌య్య గెలుస్తాడా ? చిరు గెలుస్తాడా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే రిలీజ్‌కు ముందు ప్ర‌తి అంశంలోనూ పోల్చి చూస్తున్నారు ఇద్ద‌రు హీరోల అభిమానులు.. ఇక ఇప్పుడు స‌హ‌జంగానే రెండు ఐటెం సాంగుల మ‌ధ్య కూడా కంపేరిజ‌న్ వ‌స్తోంది.

 

ఓవ‌రాల్ సోష‌ల్ మీడియాలో వ్యూస్ చూస్తే చిరు సినిమాల‌కు ఎక్కువ వ‌స్తున్నాయి. అయితే సాంగ్స్ మాత్రం బాల‌య్య సినిమావే క్లిక్ అవుతున్న‌ట్టు.. జ‌నాల నోళ్ల‌లో నానుతున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. బాల‌య్య ఐటెం సాంగ్‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి మంచి క్యాచీ ప‌దాల‌తో రాశారు. బాల‌య్య‌, ఐటెం బాంబ్ చంద్రికా ర‌వి క‌లిసి వేసిన స్టెప్పులు కూడా క్యాచీగా ఉన్నాయి.

Veera Simha Reddy - Maa Bava Manobhavalu Video Song Promo! | Manacinema

బాల‌య్య మ‌రోసారి త‌న మార్క్ మాస్ బీట్ చూపించేశాడు. సాంగ్ అంతా హై ఎన‌ర్జీతో న‌డిచింది. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ పాట ఇప్పటికే హిట్టయింది. దీనిని ప్ర‌మోష‌న్ల కోసం ఓ రేంజ్‌లో వాడుతున్నారు. దేవిశ్రీ ఇచ్చి ఎన‌ర్జిటిక్ ట్యూన్ బాగుంది. కొంచెం ఎడ్జ్ బాల‌య్య సాంగ్‌కే ఉందంటున్నా… ఫైన‌ల్‌గా ఏ సాంగ్ పై చేయి సాధిస్తుంది.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేట‌ర్లో ఏ సాంగ్ దుమ్ము దులుపుతుంది అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news