Moviesపిల్ల‌ల‌ పోష‌ణ‌కు స‌బ్బులు అమ్ముకుంటోన్న నిన్న‌టి హీరోయిన్‌... న‌మ్మలేని నిజాలు ఇవే..?

పిల్ల‌ల‌ పోష‌ణ‌కు స‌బ్బులు అమ్ముకుంటోన్న నిన్న‌టి హీరోయిన్‌… న‌మ్మలేని నిజాలు ఇవే..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఇమేజ్ ఉంటుందో ఎప్పుడు ఉన్న ఇమేజ్ పోతుందో చెప్ప‌లేం. కాబ‌ట్టి ఇమేజ్ ఉన్న‌ప్పుడే ఆఫ‌ర్ లు వ‌చ్చిన‌ప్పుడే జేబులు నింపుకోవాలి. అంతే కాకుండా ఆర్థికంగా స్థిర‌ప‌డాలి. సంపాదించిన డ‌బ్బును ఆచితూచి ఖ‌ర్చు చేస్తూ దాచుకోవ‌డం కూడా అలవాటు చేసుకోవాలి. లేదంటే ఆఫ‌ర్ లు త‌గ్గిన త‌ర‌వాత బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. కొంత‌మంది న‌టీన‌టులు ఆఫ‌ర్ లు ఉన్న‌ప్పుడు సంపాదించినా కూడా అలా సంపాదించిన డ‌బ్బును దాచుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆర్థిక క‌ష్టాలను ఎదురుకున్నారు.

Malayalam actress Aishwarya Bhaskaran talks about her divorce, now selling  soap door to door

అలాంటి లిస్ట్ లో ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఐశ్వ‌ర్య కూడా ఉన్నారు. నిజానికి ఐశ్వ‌ర్య త‌ల్లి ల‌క్ష్మి కూడా ఒక‌ప్ప‌టి హీరోయిన్… దాంతో త‌ల్లి వార‌స‌త్వంగా ఐశ్వ‌ర్య ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. చాలా సినిమాల్లో న‌టించినా కూడా శివ‌పుత్రుడు సినిమాతో ఐశ్వ‌ర్య‌కు న‌టిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. కానీ ఆ త‌ర‌వాత కూడా ఆమెను అవ‌కాశాలు వెతుక్కుంటూ రాలేదు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్య మాట్లాడుతూ త‌న జీవితంలో ఎదురైన క‌ష్టాల గురించి చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Malayalam actress Aishwarya Bhaskaran talks about her divorce, now selling  soap door to door

త‌న‌కు న‌లుగురు పిల్ల‌లు ఉన్నార‌ని చెప్పింది. అయితే వారిని పోషించ‌డానికి తాను చాలా కష్ట‌ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది. త‌న‌కు డ‌బ్బు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఆఫ‌ర్ లు రాలేద‌ని చెప్పింది. దాంతో ఆర్థిక క‌ష్టాలు వ‌చ్చాయ‌ని డ‌బ్బు కోసం స‌బ్బులు అమ్మాన‌ని తెలిపింది. స‌బ్బులు అమ్మి సంపాదించిన డ‌బ్బుతో కుటుంబాన్ని పోషించాన‌ని ఐశ్వ‌ర్య చెప్పింది. అంతకంటే ఎక్కుడ డ‌బ్బు వ‌స్తుంది అంటే పాచి ప‌నులు చేయ‌డానికి….టాయిలెట్ లు క్లీన్ చేయ‌డానికి కూడా తాను సిద్ద‌మే అని తెలిపింది.

90s actress Aishwarya's dance video with her pretty daughter goes viral -  Tamil News - IndiaGlitz.com

సినిమా త‌న‌కు తిండి పెట్ట‌లేద‌ని… సీరియ‌ల్స్ ద్వారానే తాను నటిగా గుర్తింపు సంపాదించుకున్నానని తెలిపింది. ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న ప‌నితో సంతోషంగా ఉన్నానని చెప్పింది. అంతే కాకుండా అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని యోగా చేయ‌డం వ‌ల్ల రోజుకు ఒక్క పూట మాత్ర‌మే భోజ‌నం చేయ‌గ‌లుగుతున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇక ఐశ్వ‌ర్య చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news