Moviesఅమ్మ బాబోయ్..బుట్టబొమ్మలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

అమ్మ బాబోయ్..బుట్టబొమ్మలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరియర్ మొదట్లో ఒక్క సినిమా హిట్ కొట్టడానికి చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ..ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో ఫామ్ లోకి వచ్చింది. అంతేకాదు ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడంతో ఒక్కసారిగా ఐరన్ లెగ్ నుంచి అదృష్ట దేవతగా మారిపోయింది పూజా హెగ్డే.

కాగా రీసెంట్గా మళ్లీ ఐరన్ లెగ్ అనే ముద్రను ట్యాగ్ చేసుకునింది ఈ బుట్ట బొమ్మ . అమ్మడు నటించిన లాస్ట్ మూడు సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డే కెరియర్లో టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటుంది .కాగా ఇప్పటివరకు కమిట్ అయినా సినిమాలను స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న పూజ హెగ్డే కు నిరాశే మిగిలింది. రీసెంట్గా ఆమె కాళ్ళకి గాయం కావడం వల్ల ఆమె చేస్తున్న అన్ని షూటింగ్స్ ను ఆపివేసింది.

అంతేకాదు ప్రస్తుతం పూజా హెగ్డే వాకర్ సహాయంతో నడుస్తుంది. ఈ క్రమంలోనే కాళ్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మేకప్ లేని ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది . అంతేకాదు మేకప్ లేకపోయినా సరే పూజ హెగ్డే చాలా న్యాచురల్ గా అందంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . అంతేకాదు తన కాళ్ళకు ట్రీట్మెంట్ కోసం ఆమె తన సొంత వైద్యాన్ని సొంత చిట్కాలను ఫాలో అవుతుందట . ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా కాకుండా హోమియోపతి ..న్యూట్రీషియన్స్ బెనిఫిట్స్ ద్వారా సొంతంగా సొంత టాలెంట్ తో తన కాళ్ల్ గాయం నయం చేసుకోవడానికి ట్రై చేస్తుందట. దీంతో బుట్ట బొమ్మలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news