Moviesఆ టాలీవుడ్ బ‌క్క హీరోయిన్‌ను ఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ఫుల్లుగా...

ఆ టాలీవుడ్ బ‌క్క హీరోయిన్‌ను ఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ఫుల్లుగా వాడుకుంటున్నాడా…!

టాలీవుడ్‌లో ఆమె ఒక‌ప్ప‌టి క్రేజీ హీరోయిన్‌. నార్త్ నుంచి వ‌చ్చి ముందుగా మీడియం రేంజ్ హీరోల ప‌క్క‌న న‌టించిన ఆ బ‌క్క ప‌ల్చ‌ని హీరోయిన్ త‌ర్వాత వ‌రుస పెట్టి స్టార్ హీరోలు అంద‌రితోనూ న‌టించింది. ఎన్టీఆర్‌, బ‌న్నీ, చెర్రీ, మ‌హేష్ ప‌క్క‌న ఆడిపాడింది. ఆ త‌ర్వాత కుర్ర హీరోల ప‌క్క‌న కూడా జోడీ క‌ట్టింది. అటు కోలీవుడ్‌లోనూ న‌టించి హిట్లు కొట్టింది. టాలీవుడ్‌లో ఆమె స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు స్టార్ హీరోలు అంద‌రూ ఆమె త‌మ సినిమాల్లో త‌మ ప‌క్క‌న ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

రెండు, మూడేళ్ల పాటు టాలీవుడ్‌కు ఆమె దిక్క‌న్న‌ట్టుగా ఉంది. ఇప్పుడు పూజా హెగ్డే, ర‌ష్మిక ఎంట్రీతో ఆమె ఫేడ‌వుట్ అయ్యింది. ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌డం లేదు. అయితే ఫామ్‌లో ఉండ‌గా ఆమె గ‌ట్టిగానే వెన‌కేసుకుంది. త‌న త‌మ్ముడిని కూడా హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేయించి ఇక్క‌డ వ్యాపారాలు ఓపెన్ చేయించింది. హైద‌రాబాద్‌లో రెండు, మూడు సెంట‌ర్ల‌లో ఆమె వ్యాపారాలు స్టార్ట్ చేయ‌డంతో పాటు అటు బెంగ‌ళూరు, చెన్నైలోనూ కొన్ని వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టేసింది.

ఇక హైద‌రాబాద్‌లో ఆమె వ్యాపారాల విస్త‌ర‌ణ వెన‌క ఓ బ‌డా, టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో ఆమెకు ఉన్న ప‌రిచ‌యాలే కార‌ణ‌మ‌న్న గుస‌గుస‌లు టాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ బ‌క్క ప‌ల్చ‌ని హీరోయిన్‌కు, ఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ సంబంధం చాలా వ‌ర‌కు వెళ్లిపోయింద‌ట‌. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌లు జ‌రిగాయి, విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స‌ద‌రు లీడ‌ర్ ఇచ్చిన ప్రోత్సాహ‌కంతోనే ఆమె ఇక్క‌డ భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌డంతో పాటు త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు ఆయ‌న్ను కూడా వాడేసింద‌నే అంటారు. రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు కూడా బాగానే పెట్టింద‌ట‌.

మూడేళ్ల పాటు అస‌లు వారిద్ద‌రు చాలా క్లోజ్‌గా ఉన్నారు. అయితే ఇటీవ‌లే ఆ ఫేడ‌వుట్ బ‌క్క హీరోయిన్ తాను ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంది. ఇప్పుడు ఆమె త‌న‌కు కాబోయే భ‌ర్తతో ఫేస్‌బుక్‌లో పెట్టే ఫొటోలు, హాట్ స్టిల్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఏదేమైనా ఆ బ‌క్క హీరోయిన్‌కు ఇటీవ‌ల ఛాన్సులు లేక‌పోయినా ఆమె మాత్రం స‌ద‌రు లీడ‌ర్ అండ‌తో బాగానే సెటిల్ అయ్యింద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news