Moviesవ్య‌భిచారులుగా మారిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే...!

వ్య‌భిచారులుగా మారిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే…!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోయిన్లు వ్య‌భిచారులుగా న‌టించి మెప్పించారు. గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డం అంటే ఏ హీరోయిన్‌కు అయినా సులువే. కానీ వ్య‌భిచారులుగా న‌టించాలంటే న‌ట‌న‌లో ఎంతో రాణించాల్సి ఉంటుంది. వ్య‌భిచారి క్యారెక్ట‌ర్ పండ‌డం అంత స‌లువు కాదు. స్టార్ హీరోయిన్లుగా ఉన్న ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, ఛార్మీయే కాదు.. హోమ్లీ క్యారెక్ట‌ర్లు వేసే స్నేహ కూడా ఓ సినిమాలో వ్య‌భిచారిగా న‌టించింది. మ‌రి వ్య‌భిచారులుగా న‌టించి మెప్పించిన ఆ హీరోయిన్లు ఎవ‌రో.. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ర‌మ్య‌కృష్ణ‌:
ర‌జ‌నీకాంత్ న‌ర‌సింహా సినిమాతోనే ర‌మ్య‌కృష్ణ ఎంత ప‌వ‌ర్ ఫుల్ హీరోయినో సౌత్ ఇండియాకు తెలిసింది. సౌత్ ఇండియాలోని అన్ని భాష‌ల్లోనూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ర‌మ్య.. బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయిపోయింది. క‌మ‌ల్‌హాస‌న్ పంచ‌తంత్రం సినిమాలో వ్య‌భిచారిగా న‌టించిన ర‌మ్య‌కు ఆ సినిమాలో పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త‌ర్వాత సూప‌ర్‌డీల‌క్స్ సినిమాలోనూ ఆమె ఈ పాత్ర చేసింది.

అనుష్క‌:
స్వీటీబ్యూటీ అనుష్క కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామ‌ర్‌కు గేట్లు ఎత్తేసింది. అయితే బాహుబ‌లి సినిమాలో ఆమె చేసిన దేవ‌సేన పాత్ర ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. అనుష్క ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక ఐదేళ్ల‌కు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వేదం సినిమాలో వ్య‌భిచారిగా క‌న్నీళ్లు తెప్పించింది. అస‌లు వ్య‌భిచారులు మ‌గాళ్ల‌ను ఎలా క‌వ్విస్తారో.. అచ్చుగుద్దిన‌ట్టు అవే ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆమె త‌న న‌ట‌న‌తో వేదంలో హైలెట్ అయ్యింది.

శ్రీయాశ‌ర‌న్ :
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీయా ప‌విత్ర సినిమాలో వ్య‌భిచారిగా న‌టించింది. రాజ‌కీయ నాయ‌కుల క్రీనీడ‌లో వ్య‌భిచారులు ఎలా న‌లిగిపోతారో ఈ పాత్ర‌లో శ్రీయ చేసి చూపించింది. ఈ పాత్ర‌తో ఆమెకు మంచి మార్కులు ప‌డ్డాయి.

స్నేహ :
అస‌లు స్నేహ తెలుగు అమ్మాయి కాక‌పోయినా ఆమె అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచులాగానే మ‌నం ఊహించుకుంటాము. స్నేహ ఫ్యామిలీ మెప్పించే పాత్ర‌లే ఎక్కువుగా చేసింది. త‌ర్వాత భ‌క్తిర‌స పాత్ర‌ల‌తో కూడా మెప్పించింది. అయితే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా స్నేహ ప‌దుపెట్టేయ్ అనే త‌మిళ సినిమాలో వ్య‌భిచారిగా న‌టించింది.

ఛార్మీ :
ఛార్మీ ఏ సినిమా చేసినా అందానికి గేట్లు ఎత్తేయాల్సిందే. ఛార్మీ న‌ట‌న కంటే ముందు అందంతోనే ఆక‌ట్టుకుంటుంది. ఛార్మీ కెరీర్ చివ‌ర్లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి సినిమాలో వ్య‌భిచారం చేసే అమ్మాయిగా న‌టించింది. అయితే ఈ పాత్ర అంత ఆక‌ట్టుకోలేదు. ఈ సినిమా ప్లాప్ అవ్వ‌గా… ఆ త‌ర్వాత ఛార్మీ కెరీర్ పాతాళానికి ప‌డిపోయి నిర్మాత అవ‌తారం ఎత్తుకుంది.

స‌దా :
జ‌యం సినిమాతో యూత్ మ‌న‌స్సుల‌ను కొల్ల‌గొట్టేసింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో బాల‌కృష్ణ‌తో పాటు కోలీవుడ్‌లో శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అప‌రిచితుడు సినిమాల్లో న‌టించినా స్టార్ హీరోయిన్‌గా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత ఆమె ఎందుకో అవ‌కాశాలు అందిపుచ్చుకోలేదు. చిర‌కు టార్చ్‌లైట్ సినిమాలో రోడ్ల ప‌క్క‌న లారీడ్రైవ‌ర్ల కింద న‌లిగిపోయే ప‌చ్చి వ్య‌భిచారి పాత్ర‌లో న‌టించింది.

హ‌రిప్రియ :
అబ్బాయి క్లాస్‌.. అమ్మాయి మాస్ సినిమాలో హ‌రిప్రియ కూడా వ్య‌భిచారం చేసుకుంటూ హీరోనే ల‌వ్‌లో ప‌డేసే అమ్మాయిగా క‌నిపించింది.
సంగీత‌:
ఇక సంగీత కూడా ఒక‌ప్పుడు హోమ్లీ పాత్ర‌ల్లోనే న‌టించింది. కెరీర్ చివ‌ర్లో అవ‌కాశాలు త‌గ్గాక ఆమె ధ‌నం సినిమాలో ఈ పాత్ర‌లో న‌టించింది.
ఉద‌య‌భాను :
ఒక‌ప్ప‌టి హాట్ యాంక‌ర్ ఉద‌య‌భాను కూడా ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది. ఆమె మ‌ధుమ‌తి సినిమాలో మ‌గాళ్ల‌ను క‌వ్వించే వ్య‌భిచారిగా మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news