Moviesప్ర‌భాస్ హీరోయిన్ ఇంత‌మంది పెళ్లైన హీరోల‌తో ఎఫైర్లు పెట్టుకుందా...? చివ‌ర‌కి ఆ...

ప్ర‌భాస్ హీరోయిన్ ఇంత‌మంది పెళ్లైన హీరోల‌తో ఎఫైర్లు పెట్టుకుందా…? చివ‌ర‌కి ఆ హీరోతో కూడా..?

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఏక్ నిరంజ‌న్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ కంగ‌నా ర‌నౌత్. పూరీ ప‌రిచ‌యం చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలో అందాల‌ను ఆర‌బోసింది. కానీ ఏక్ నిరంజ‌న్ సినిమా అనుకున్న‌మేర హిట్ అవ్వ‌లేదు. దాంతో కంగ‌నా ర‌నౌత్ కు టాలీవుడ్ లో అవ‌కాశాలే రాదు. ఆ త‌ర‌వాత కంగ‌నా తిరిగి బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అక్క‌డ వ‌రుస హిట్ ల‌ను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌లో న‌టించి త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ బాలీవుడ్ లో కంగ‌నా అంటే గిట్ట‌నవాళ్లు చాలా మంది ఉన్నారు.

దానికి కార‌ణం కూడా ఈ అమ్మ‌డి నోటిదుర‌ద‌నే….ప్రొడ్యూస‌ర్ లు, స్టార్ హీరోలపై కంగ‌నా విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా నెపోటిజం అంటూ అప్ప‌ట్లో వీడియోలు చేస్తూ బాలీవుడ్ స్టార్స్ పై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా తానే గొప్ప న‌టి అని త‌న‌లా ఎవ‌రూ న‌టించ‌లేర‌ని సైతం కంగ‌నా చెప్పుకోవ‌డం బాలీవుడ్ జ‌నాల‌కు కూడా న‌చ్చ‌దు. మ‌రోవైపు సినిమాల‌పైనే కాకుండా రాజ‌కీయాలపై కూడా త‌న‌దైన స్టైల్ లో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో త‌రచూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు.

ఇక కంగ‌నా ల‌వ్ ఎఫైర్ ల విష‌యానికి వస్తే ప్ర‌స్తుతం సింగిల్ గానే ఉంటోంది.. కానీ అప్ప‌ట్లో ఈ బ్యూటీ పెళ్లైన హీరోతో డేటింగ్ చేస్తోందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అప్ప‌ట్లో కంగ‌నా ర‌నౌత్ హృతిక్ రోషన్ తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింది అంటూ వార్త‌లు వినిపించాయి. కంగ‌నా కోస‌మే హృతిక్ త‌న భార్య సుసానేకు విడాకులు ఇచ్చేశాడంటారు. ఆ త‌ర్వాత కార‌ణం తెలియ‌దు కాని హృతిక్ కంగ‌నాకు బ్రేక‌ప్ చెప్పేశాడు.

అంతే కాకుండా మ‌రోపెళ్లైన హీరో అజ‌య్ దేవ‌గ‌న్ తో కూడా కంగ‌నా డేటింగ్ చేసింద‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వినిపించాయి ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ కూడా బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ట‌. అంతే కాకుండా సీనియ‌ర్ హీరో న‌టుడు ఆదిత్య పంచోలితో సైతం కంగనా డేటింగ్ చేసింద‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వినిపించాయి. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

అయితే ఆదిత్య పంచోలీ కంగ‌నా టార్చ‌ర్ భ‌రించ‌లేక వ‌దిలించేసుకున్నాడంటారు. అంతే కాకుండా ఈజిప్ట్ కు చెందిన ఇమ్రాన్ అనే వ్య‌క్తితోనూ కంగనా ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని వార్త‌లు వినిపించాయి. ఇద్ద‌రి ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇక ఇంత‌మందితో ల‌వ్ ఎఫైర్ లు న‌డిపిన బ్యూటీ చివ‌రికి ఎవ‌రిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news