Moviesit's Official: ప్రభాస్ తో కృతిసనన్ ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసిందోచ్..!!

it’s Official: ప్రభాస్ తో కృతిసనన్ ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసిందోచ్..!!

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు . ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది . అయితే ఈ సినిమా షూట్ టైంలోనే వీళ్లిద్దరు మనసులు కలిసాయని ..అప్పటినుంచి ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇద్దరు కూడా నో చెప్పకపోవడంతో ఆ వార్త నిజమే అంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

అయితే ముందు నుంచి ప్రభాస్ కి అనుష్కతో ఉన్న రిలేషన్షిప్ కారణంగా ఈ న్యూస్లు కొంతమంది జనాలు నమ్మలేదు. అయితే అలాంటి జనాలను నమ్మేలా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . గత మూడు రోజుల నుంచి ప్రభాస్ తొ-కృతిసనన్ ఎంగేజ్మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కృతి సనన్ మనసులో ఓ హీరో ఉన్నాడని ..ఆ హీరో ప్రజెంట్ దీపిక పదుకొనేతో షూట్ లో పాల్గొంటున్నాడని చెప్పాడు.

కాగా దీంతో సగం మ్యాటర్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . అయితే మిగతా సగాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు ఫిలిం క్రిటిక్ .. రీసెంట్గా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రతిసారి ప్రభాస్ ప్రేమను అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు . కన్ఫామ్డ్ న్యూస్ అంటూ వాళ్ళ ఎంగేజ్మెంట్ త్వరలో జరగబోతుంది అంటూ పక్క సమాచారంతో పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న హ్యాపీనెస్ కొందరు జనాల్లో ఉన్నా.. అనుష్క అయితే బాగుంటుంది.. కృతి- ప్రభాస్ కి అంత మంచి జోడీ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు .

ఏది ఏమైనా సరే ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే వీళ్లిద్దరి ప్రేమను కన్ఫర్మ్ చేశాడు ప్రభాస్ ..నడిచొస్తుండగా ప్రభాస్ నే కృతి కి చెయ్యి ఇవ్వమని సిగ్నల్ చేశాడు. ఆ టైంలో వీళ్ళకి సంబంధించిన వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే ఇప్పుడు ఉమర్ సైంధ్ లాంటి ఫిలిం క్రిటిక్ చేయడంతో నిజంగా ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news