Moviesప్రభాస్ తో అల్లు అర్జున్ కి పోటినా..? ఇంతకన్న పెద్ద జోక్...

ప్రభాస్ తో అల్లు అర్జున్ కి పోటినా..? ఇంతకన్న పెద్ద జోక్ ఉందా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో వైరల్ గా మారింది . పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి.. ఐకాన్ హీరో అల్లు అర్జున్ పోటీ ఇస్తాడా ..? అంటూ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. దీనంతటికీ కారణం వాళ్ళిద్దరూ స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఇష్టపడడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా వాళ్లల్లోకి అందరికీ ప్రత్యేకంగా నిలుస్తాడు ప్రభాస్ .

ఆ హైట్ ..ఆ వెయిట్ అబ్బో అదో సపరేటు కటౌట్.. అల్లు అర్జున్ కూడా అంతే ఫిజిక్ పరంగా ఎలా ఉన్నా సరే లుంగీ కట్టి రంగంలోకి దిగాడంటే ఇక మొత్తం రచ్చ రచ్చ అయిపోవాల్సిందే . రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకత చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కూడా ఆ క్రేజ్ ను డబుల్ చేసుకోబోతున్నాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ నెలకొల్పాడు .

ఇలాంటి క్రమంలో ప్రభాస్ – అల్లుఅర్జున్ ఇద్దరు కూడా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. మనకు తెలిసిందే మహేష్ బాబు తో సినిమాకి సిద్ధమైన రాజమౌళి ..ఈ సినిమా అయిపోగానే మరో భారీ ప్రాజెక్టు ని తెర పైకి తీసుకురాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో.. బాహుబలి 3 కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే తీసిన హీరోతోనే మళ్లి తీయకుండా అల్లు అర్జున్ లాంటి హీరోలతో తీస్తే రాజమౌళికి …అల్లు అర్జున్ ఇద్దరికీ మంచిది అంటున్నారు జనాలు . కాగా ప్రభాస్ తో బాహుబలి 3 తీస్తే రాజమౌళి క్రేజ్ రేంజ్ డబుల్ కాదు ట్రిపుల్ అవుతాయని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

దీంతో అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది . కొందరు కావాలని ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక్క హిట్టు కొట్టిన ఈ హీరో ఎన్నాళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికేస్తాడు అంటుంటే .. ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి ప్రభాస్ తో పోటీనా జోక్ చేయకండి రా బాబు అంటున్నారు . చూడాలి ఈ గొడవ ఎప్పుడు కూల్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news