Moviesహన్సిక కు కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.. వేల...

హన్సిక కు కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.. వేల కోట్లా అస్తికి కింగ్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు ..పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. తాము ప్రేమించిన వ్యక్తులని ఇంట్లో ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని త్వరగా గుడ్ న్యూస్ చెప్పేస్తూ అభిమానులకి డబుల్ ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే స్టార్ బ్యూటీస్ కత్రినా కైఫ్, అలియా భట్, నిక్కీ గల్రాని, నయనతార పెళ్లిలు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయిన విషయం తెలిసిందే.

కాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కోలీవుడ్ బ్యూటీ హన్సిక . దేశముదురు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత ఇట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ క్రమంలోనే తమిళంలో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్లిన హన్సిక తెలుగు ఇండస్ట్రీని మరిచిపోయింది . రీసెంట్గా హన్సిక తాను ప్రేమించిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది .

రెండు రోజుల క్రితం ఐఫిల్ టవర్ వద్ద దిగినటువంటి ఫోటోలను మీడియాలో షేర్ చేస్తూ “ఐ లవ్ యు సో హెల్ నౌ అండ్ ఫరెవర్” అంటూ రాసుకొచ్చింది. దీంతో సో హెల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటా..? అంటూ జనాలు తెగ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్..ట్ల ఆస్తికి ఓన్లీ సన్ ..అంతేకాదు ఎలాంటి డౌన్ అయిన బిజినెస్ అయినా సరే కేవలం ఒక నెలలోనే హైప్ తీసుకోరాగలడు. అలాంటి బిజినెస్ స్ట్రాటజీ ఉన్న మైండ్ . ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయనకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి . అంతేకాదు హన్సిక ,సోహెల్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా.. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ గా మారిపోతున్నారు. డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని పురాతన ప్యాలెస్ లో ఎంతో ఘనంగా వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళు పెళ్లి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news