Moviesఎంత స్టార్ హీరోయిన్ అయినా ఆ డైరెక్ట‌ర్ ప‌క్క‌లోకి రావాల్సిందే... అందుకేనా...

ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఆ డైరెక్ట‌ర్ ప‌క్క‌లోకి రావాల్సిందే… అందుకేనా భార్య విడాకులు…?

టాలీవుడ్ లో అతను ఓ స్టార్ డైరెక్టర్. వైవిధ్యమైన సినిమాలు తీస్తారని.. సృజనాత్మకత ఉంటుందని, ఆయ‌న‌ సినిమాలలో ఎమోషన్ తో పాటు నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తారన్న మంచి పేరు ఉంది. ఆ డైరెక్టర్ సినిమాలు అంటే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా కామన్ గా వస్తూ ఉంటాయి. చిన్న హీరోలతో మాత్రమే కాదు.. ఓ అగ్ర హీరోతో ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమాను డైరెక్ట్ చేసి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. సామాజిక, చారిత్రక మానవీయ కథాంశాలతో సినిమాలు తెర‌కెక్కిస్తారు అన్న మంచి పేరు ఆ డైరెక్టర్‌కు ఉంది.

 

అయితే ఆ డైరెక్టర్ చివరగా తీసిన మూడు సినిమాలు ప్రేక్షకులను బాగా డిజ‌ప్పాయింట్ చేశాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండేళ్లుగా షూటింగ్ నాన్చుతూ జరుగుతూ వస్తోంది. అసలు ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో ఎప్పుడు ? రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే సదరు డైరెక్టర్ చాలా లేట్ వయసులో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన ఏడాది లోపే భార్యతో మనస్పర్ధలు రావడంతో భార్య ఆ డైరెక్టర్‌కు విడాకులు ఇచ్చేసింది.

భార్య డైరెక్టర్ కు విడాకులు ఇవ్వడం వెనక ప్రధాన కారణం డైరెక్టర్ కు హీరోయిన్లతో ఉన్న అక్రమ సంబంధాలే కారణం అన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపించింది. త‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఓ సినిమాలో న‌టించిన ఓ హీరోయిన్‌తో త‌న బెడ్‌ రూమ్‌లో ఉండ‌గా భార్య‌కు అడ్డంగా దొరికిపోయాడు. పెళ్ల‌య్యాక ఆరు నెల‌లకు కూడా భార్య‌గా దూరంగా ఉండ‌డం.. షూటింగ్‌లు అని చెప్పి త‌ప్పించుకుంటూ ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె నిఘా పెట్టింది.

ఆ నిఘాలో ఆమె స‌దరు డైరెక్ట‌ర్ రూమ్‌లోనే ఆ హీరోయిన్‌తో ఉండ‌గా త‌న భ‌ర్త‌ను అడ్డంగా బుక్ చేసేసింది. ఆ వెంట‌నే ఆమె త‌న భ‌ర్త అయిన డైరెక్ట‌ర్‌కు విడాకులు ఇచ్చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌డం.. వెంట‌నే విడాకులు ఇచ్చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. సౌత్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఇద్ద‌రు హీరోయిన్లు కూడా స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమాల్లో న‌టించారు. వారిద్ద‌రిని త‌న సినిమాల్లో బుక్ చేసే ముందే క‌మిట్‌మెంట్ తీసుకుని… త‌న కోరిక తీర్చాకే వాళ్ల‌కు ఛాన్సులు ఇచ్చాడ‌ని అంటారు.

ఎంత మంచి క‌థ తీసినా.. స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమాల‌పై ఎన్ని ప్ర‌శంస‌లు ఉన్నా కూడా హీరోయిన్ల విష‌యంలో మాత్రం క‌మిట్‌మెంట్ తీసుకోకుండా న సినిమాల్లో ఛాన్సులు ఇవ్వ‌డ‌నే అంటారు. ఆ బ‌ల‌హీన‌తే చివ‌ర‌కు ఆ డైరెక్ట‌ర్ కాపురం కూలిపోయేందుకు కార‌ణ‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news