Moviesహాస్పటల్‌లో జబర్దస్త్ కమెడియన్...చచ్చి బ్రతికినా ఆటో రామ్ ప్రసాద్‌..ఏమైందంటే..?

హాస్పటల్‌లో జబర్దస్త్ కమెడియన్…చచ్చి బ్రతికినా ఆటో రామ్ ప్రసాద్‌..ఏమైందంటే..?

బుల్లితెరపై రాంప్రసాద్ కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్మల్ రాంప్రసాద్ అంటే ఎవరు గుర్తుపట్టరు . ఆటో రాంప్రసాద్ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. అలా ఆటో పంచు లతో పాపులర్ అయిన రాంప్రసాద్ ..జబర్దస్త్ లో కి వచ్చాక కారు, బంగ్లా కొనుక్కొని భార్యా పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నాడు. అంతేకాదు తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి స్కిట్స్ వేస్తూ ..నవ్విస్తూ అలరిస్తున్నాడు .

సుడిగాలి సుధీర్ర్ రీసెంట్ గా నటించిన చిత్రం “గాలోడు” ఎలాంటి హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు . గెటప్ శ్రీను సైతం ఈ సినిమా సక్సెస్ లో పాల్గొన్నాడు . అయితే సుడిగాలి సుధీర్ర్ జాన్ జిగిడి దోస్త్ రాంప్రసాద్ మాత్రమే ఎక్కడా కనిపించలేదు. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోను.. సినిమా ఆడియో ఫంక్షన్ లోనూ ..సినిమా సక్సెస్ మీట్ లోను ఎక్కడ కనిపించకపోయేసరికి రాంప్రసాద్- సుధీర్ మధ్య గొడవలు తలెత్తయని వార్తలు వినిపించాయి .

కాగా రీసెంట్ గా సుధీర్ -గెటప్ శ్రీను -రాంప్రసాద్ ని కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రాంప్రసాద్ తలకు ఏదో పెద్ద కవర్ కట్టుకొని కనిపించాడు .అది చూస్తుంటే అతని తలకి ఏదో భారీ సర్జరీ అయిందని మాత్రం తెలుస్తుంది. అయితే ఆ సర్జరీ దేనికి సంబంధించింది అని మాత్రం బయటకు రాలేదు. గతంలో ఆయనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాని కారణంగానే జబర్దస్త్ ఆపేయాలనుకుంటున్నారని అనుకుంటున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలో ఈ ఫోటో బయటకు రావడం జబర్దస్త్ కమెడియన్స్ కు మింగుడు పడడం లేదు . అసలు రాంప్రసాద్ కి ఏమైంది ..? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది ..? తన ఫ్రెండ్స్ అయినా రియాక్ట్ అయ్యి అభిమానులకు అసలు విషయం చెప్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news