Moviesబిగ్ బ్రేకింగ్‌: మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాపై బాల‌య్య ప్ర‌క‌ట‌న‌... ముహూర్తం కూడా...

బిగ్ బ్రేకింగ్‌: మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాపై బాల‌య్య ప్ర‌క‌ట‌న‌… ముహూర్తం కూడా వ‌చ్చేసింది..

నంద‌మూరి అభిమానులు క‌ళ్లుకాయ‌లు కాచేలా నాలుగైదేళ్లుగా వెయిట్ చేస్తోన్న నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాపై న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అస‌లు బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా టైం నుంచే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నా అవేవి నిజం కాలేదు. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు బాల‌య్య మోక్ష‌జ్ఞ డెబ్యూపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చేశాడు.

వ‌చ్చే యేడాది త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ ఫిల్మ్ ఉంటుద‌ని.. వ‌చ్చే స‌మ్మ‌ర్ త‌ర్వాత మోక్ష‌జ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌రు ? అన్న‌ది మాత్రం బాల‌య్య చెప్ప‌లేదు. బోయ‌పాటి శ్రీనుతో మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఉంటుందా ? అన్న ప్ర‌శ్న‌కు అంతా దైవేచ్ఛ అని వ‌దిలేశారు.

అయితే అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని కొద్ది రోజులుగా వ‌స్తోన్న వార్త‌ల నేప‌థ్యంలో అఖండ 2 ఉంటుంద‌ని కూడా చెప్పాడు. ఇక ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో అఖండ సినిమాను ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డ కూడా అఖండ‌కు మంచి మార్కులు ప‌డ‌డంతో పాటు ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. ఇక అఖండ సీక్వెల్‌పై బాల‌య్య మాట్లాడుతూ ఇప్ప‌టికే స‌బ్జెక్ట్ రెడీ అయ్యింద‌ని.. త్వ‌ర‌లోనే ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇక బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమాలో న‌టిస్తాడు. ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news