Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి సినిమాలో ల‌క్కీ హీరోయిన్‌... !

బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాలో ల‌క్కీ హీరోయిన్‌… !

బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తోన్న వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిసెంబ‌ర్ నుంచి బాల‌య్య త‌న 108వ సినిమాను ప‌ట్టాలెక్కించేస్తాడు. డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల‌తో మంచి స్వింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఈ సినిమా చేస్తున్నాడు. ఎఫ్ 3 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌త‌ర్వాత అనిల్ రావిపూడి ఈ సినిమా క‌థ మీదే క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, పెద్ది చంటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ జాన‌ర్లోనే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు తెర‌కెక్కించి హిట్ కొట్టిన అనిల్ త‌న స్టైల్‌, జాన‌ర్‌కు భిన్నంగా యాక్ష‌న్ హీరో, మాస్ ఆఫ్ గాడ్ బాల‌య్య‌తో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అంచ‌నాల‌కే అంద‌డం లేదు. అస‌లు ఈ సినిమాను అక్టోబ‌ర్‌లోనే మొద‌లు పెట్టాలి. అయితే బాల‌య్య‌కు క‌రోనా రావ‌డంతో పాటు అన్‌స్టాప‌బుల్ షూటింగ్‌తో వీర‌సింహారెడ్డి షెడ్యూల్స్ ఆల‌స్యం అయ్యింది.

అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా ఆల‌స్యం అవుతోంది. అనిల్ ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తున్నాడు. ఇక బాల‌య్య గెట‌ప్ ఎలా ? ఉండాల‌నేదానిపై కూడా మూడు ర‌కాల స్కెచ్‌లు గీయించి అందుకు అనుగుణంగా డ్రెస్సులు, విగ్‌లు కూడా ముంబైలో రెడీ చేయిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి రెండు అదిరిపోయే అప్‌డేట్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

బాల‌య్యకు కూతురుగా వ‌ర్థ‌మాన హీరోయిన్ శ్రీలీల పేరును ఎప్పుడో ఫైన‌లైజ్ చేశారు. బాల‌య్య‌ను ఢీకొట్టే విల‌న్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ రాంపాల్‌ను సెల‌క్ట్ చేశారు. బాల‌య్య సినిమాలో విల‌న్‌గా చేసేందుకు అర్జున్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇక బాల‌య్య 55 ఏళ్ల వ‌య‌స్సు మ‌ళ్లిన వ్య‌క్తిగా సినిమాలో క‌నిపిస్తుండ‌డంతో హీరోయిన్‌గా ప‌లు పేర్లు ప‌రిశీలించారు. థ‌ర్టీ ప్ల‌స్‌లా క‌నిపించాల్సిన పాత్ర కావ‌డంతో ముందుగా ప్రియ‌మ‌ణి పేరు వినిపించింది.

ఇప్పుడు ఆశిన్‌తో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయంటున్నారు. ఆశిన్ బాల‌య్య‌కు ల‌క్కీ హీరోయినే. ఆమె గ‌తంలో కూడా బాల‌య్య‌కు జోడీగా ల‌క్ష్మీన‌ర‌సింహా సినిమాలో న‌టించింది. 2004 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ఆశిన్ బాల‌య్య ప‌క్క‌న చేసేందుకు రెడీగా ఉన్నా ఆమెకు కొద్ది రోజుల పాటు ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయ‌ని టాక్ ? మ‌రి ఆశిన్ బాల‌య్య ప‌క్క‌న జోడీగా సెట్ అయితే క్రేజీ కాంబినేష‌నే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news