Moviesఅంత బాగున్నా తమన్ కి అదొక్కటే మైనస్..అది ఇదే..!!

అంత బాగున్నా తమన్ కి అదొక్కటే మైనస్..అది ఇదే..!!

ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ ,,ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు, షార్ట్ ఫామ్ లో తమన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు . అంతలా ఆయన మ్యూజిక్ తో తెలుగు, తమిళ భాషలలో ఓ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తూ తన డ్రమ్ సౌండ్ తోనే కుర్రాళ్లకు ఊపు తెప్పిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ కొడితే మంచంలో ఉన్న ముసలోళ్ళు సైతం లేసి చిందులేయాల్సిందే ..అంతలా తన ఫాస్ట్ బీట్ తో రిధమ్ తో ఆకట్టుకుంటాడు .

రవితేజ నటించిన కిక్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమయ్యాడు . ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ లు లకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు .అంతే కాదు బాయ్స్ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించాడు . మ్యూజిక్ పై ఉండే ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ డైరెక్టర్గా మారి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా పేరు సంపాదించుకున్నాడు . ఈ మధ్యకాలంలో తమన్ మ్యూజిక్ ఇచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే మణిశర్మ, కీరవాణి ,కోటి, దేవి శ్రీ ప్రసాద్. అయితే వీళ్లని మర్చిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తూ..తమన్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కంటెంట్ బాగా లేకపోయినా ఈయన మ్యూజిక్ కారణంగానే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాలో ఈయన మ్యూజిక్ పవన్ కళ్యాణ్ ని సైతం ఆకట్టుకునింది.

అయితే రీసెంట్ గానే గాడ్ ఫాదర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు తమన్. కాగా ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న తమన్ కు ఒకే ఒక మైనస్ పాయింట్ అదే కాపీ రాజా. సోషల్ మీడియాలో ఈయనని కాపీ రాజా అంటూ పిలుస్తూ ఉంటారు. ఏ మ్యూజిక్ చేసిన సరే ఆ మ్యూజిక్ ఎప్పుడో ఒకచోట ఎక్కడో ఒక దగ్గర విన్నట్లే ఉంటుంది. అంతెందుకు ఆయన సినిమాకు చేసిన మ్యూజిక్ ని అటు ఇటుగా మార్చి మళ్లీ ఈయననే మ్యూజిక్ కొడతారు అన్న చెడ్డ పేరు ఉంది . ఆ ఒక్కటి తప్పిస్తే తనలో వేలెత్తి చూపడానికి ఏమీ లేదు.. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఆ పేరును ఎలా మార్చుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news