Moviesఏఎన్నార్ కూడా కృష్ణ‌ను కావాల‌ని ఇబ్బంది పెట్టాడా... అస‌లేం జ‌రిగింది... !

ఏఎన్నార్ కూడా కృష్ణ‌ను కావాల‌ని ఇబ్బంది పెట్టాడా… అస‌లేం జ‌రిగింది… !

టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఉన్న విభేదాలు గురించి అందరికీ తెలిసిందే. అసలు కృష్ణ సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమా చూసి ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి కలిగింది. ఆ తర్వాత కృష్ణ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు రావటంతో ఆయనకు జరిగిన సన్మానాలు చూసిన తర్వాత ఆయనకు కూడా సినిమాల్లోకి వచ్చి హీరో అవ్వాలన్న కోరిక కలిగింది.

ఇక కృష్ణ సినిమాల్లోకి రావాలన్న కోరికతో మద్రాస్ వెళ్లిన తర్వాత కూడా ముందుగా ఎన్టీఆర్‌ని కలిశారు. అయితే వయసు చిన్నది కావడంతో రెండు సంవ‌త్స‌రాలు నాటకాలు వేసిన తర్వాత సినిమాల్లోకి రావాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పిన‌ట్టే రెండేళ్లు నాట‌కాలు వేశారు. ఆ తర్వాత ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స్టార్ హీరో అయ్యి ఎన్టీఆర్‌కే పోటీ ఇచ్చారు. త‌ర్వాత అదే ఎన్టీఆర్ తో కృష్ణకు ఇటు సిని రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది.

కృష్ణ- ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. పౌరాణికం, సాంఘిక పాత్రల్లో ఇద్దరు పోటీపడి నటించేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ, కృష్ణ కురుక్షేత్రం సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఇద్దరివి వేరువేరు దారులు అయ్యాయి. అయితే బయట ప్రపంచానికి కేవలం ఎన్టీఆర్ – కృష్ణ మధ్య ఉన్న విభేదాలు గురించి మాత్రమే తెలుసు. అనుహ్యంగా మరో లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు తో కూడా కృష్ణకు కొన్ని విషయాల్లో గ్యాప్ వచ్చిందన్న విషయం తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని కృష్ణ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అల్లూరి సీతారామరాజు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కృష్ణకు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 17 ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. సీతారామరాజు లాంటి పవర్ఫుల్ పాత్రలో కృష్ణను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాత ఎన్ని మంచి సినిమాలు చేసినా కూడా చాలా లైట్ తీసుకున్నారు. చివరకు కృష్ణ గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమాను మళ్ళీ తాను హీరోగా తెరకెక్కించారు. దేవదాసు తప్పకుండా తనకు బ్రేక్ ఇస్తుందని వరుస ప్లాప్‌ల‌కు బ్రేక్ వేస్తుందని కృష్ణ భావించారు.

అయితే దేవదాసు కూడా అట్టర్ ప్లాప్ అయింది. విచిత్రం ఏంటంటే కృష్ణ దేవదాసు సినిమా రిలీజ్ చేయటానికి వారం రోజులు ముందు అక్కినేని నటించిన దేవదాసు సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు.
రీ రిలీజ్ లో ఏఎన్ఆర్ దేవదాసు సినిమా 100 రోజులు ఆడితే… కృష్ణ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. అలా కృష్ణ దేవదాసు సినిమా ఏఎన్ఆర్ దేవదాస్‌తో పోటీపడి మరి ఘోర అవమానం మూటకట్టుకుంది. అయితే ఏఎన్ఆర్ త‌న‌ దేవదాసు సినిమా మొత్తాన్ని 1. 50 లక్షలకు కొని మ‌ళ్లీ రిలీజ్ చేశారు.

కృష్ణ దేవదాసుపై కావాలని తన సినిమాను ఆయన రిలీజ్ చేయించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
అయితే ఇది కేవలం వ్యాపారపరమైన పోటీ అని… ఆ తర్వాత తన సొంత బ్యాన‌ర్‌లో ఏఎన్ఆర్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేశార‌ని కృష్ణ చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎప్పటికీ మంచి స్నేహమే కొనసాగిందని కృష్ణ‌ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news