Moviesచాలా సైలెంట్‌గా ఉండే నాగ‌శౌర్య.. అనూష ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడ‌బ్బా... ఇంట్ర‌స్టింగ్...

చాలా సైలెంట్‌గా ఉండే నాగ‌శౌర్య.. అనూష ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడ‌బ్బా… ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీయే…!

టాలీవుడ్ లో గత ఏడాదికాలంగా కుర్ర హీరోలు అందరూ వ‌ర‌స‌పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ టైం లో రానా- నిఖిల్ ఓ ఇంటి వారు అయ్యారు. ఆ తర్వాత నితిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక తాజాగా ఈరోజు యంగ్ హీరో నాగశౌర్య కూడా ఓఇంటివాడు అయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడు అడుగులు వేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆదివారం బెంగళూరులో నాగశౌర్య – అనూష శెట్టి బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై నాగశౌర్య దంపతులను ఆశీర్వదించారు. విజయవాడకు చెందిన నాగశౌర్య మూల్పూరి 2011లో సినీ రంగంలోకి ప్రవేశించాడు.
నాగశౌర్య తొలి సినిమా క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్. ఆ తర్వాత జాతీయ అవార్డు పొందిన చందమామ కథలు సినిమాలో కూడా నాగశౌర్య నటించాడు. తర్వాత వరుసగా ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఛ‌లో సినిమా నాగశౌర్యకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతోనే రష్మికా మంద‌న్న టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది.

నాగశౌర్య ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉంటాడన్న పేరు ఉంది. ఇన్నేళ్ల కెరీర్‌లో నాగశౌర్యపై ఎప్పుడు రూమర్లు ఉన్నాయన్న వార్తలు రాలేదు. హీరోయిన్లతో పాటు తన సినిమాల్లో పని చేసే తోటి నటీనటులతో తన లిమిట్ వరకు తాను ఉంటాడు.. బయట కూడా ఎక్కువగా కనిపించడు. అలాంటి నాగశౌర్య అనూష శెట్టి ప్రేమలో ఎలా ? పడ్డాడ‌బ్బా అన్న సందేహాలు ఇండస్ట్రీలో చాలామందికి వస్తున్నాయి.

అనూష శెట్టి చాలా ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. ఈ క్రమంలోనే ఆమె చేసిన కొన్ని డిజైన్లు నచ్చడంతో నాగశౌర్య కూడా ఆమెకు కొన్ని పెద్ద‌ కాంట్రాక్టులు ఇప్పిచ్చాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ప్రేమగా మారింది. అలా ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈరోజు నాగశౌర్య – అనూష వివాహం జరగగా ఈ దంపుతుల పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పలువురు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news