Movies55 ఏళ్ల తుల‌సి... 43 ఏళ్ల ప్ర‌భాస్ శ్రీను.. కొత్త రిలేష‌న్...

55 ఏళ్ల తుల‌సి… 43 ఏళ్ల ప్ర‌భాస్ శ్రీను.. కొత్త రిలేష‌న్ షిప్‌..!

సినిమా వాళ్లు, ఇత‌ర రంగాల్లో ఉన్న మ‌గ‌, ఆడ సెల‌బ్రిటీలు కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు అనుమానించే రోజులు ఇవి. ఇక గాసిప్ రాయుళ్లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌థ‌లు అల్లేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్‌లో కూడా ఓ సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, ఓ సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ న‌టుడు క్లోజ్‌గా ఉండ‌డంతో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఆలీతో స‌ర‌దాగా షో ను ఆలీ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో మాంచి ర‌క్తి క‌ట్టిస్తూ ఉంటాడు.

ఆలీతో స‌ర‌దాగా షోకు చాలా మంది గెస్టులు వ‌స్తూ ఉంటారు. ఒక్కోసారి కాంబినేష‌న్ అన్న‌ట్టుగా ఇద్ద‌రు గెస్టుల‌ను కూడా పిలుస్తూ ఉంటాడు. ఒకే సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు లేదా టెక్నీషీయిన్లు క‌లిసి ఈ షోకు వ‌చ్చి త‌మ అనుభ‌వాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆస‌క్తిగా మారింది.

త‌ల్లి పాత్ర‌లు చేసే సీనియ‌ర్ న‌టిమ‌ని తుల‌సి.. ఆమె మాజీ హీరోయిన్ కూడా..! ఆమెతో పాటు ప్ర‌భాస్ అసిస్టెంట్‌గా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌భాస్ శ్రీను క‌లిసి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వీరిద్ద‌రు క‌లిసి రావ‌డంతో స‌హ‌జంగానే ఎట్రాక్ష‌న్ అయ్యింది. తుల‌సి వ‌య‌స్సు 55, ప్ర‌భాస్ శ్రీను వ‌య‌స్సు 43. అయితే అప్ప‌ట్లో డార్లింగ్ చేశాం క‌దా.. అప్పుడే ఈవిడ త‌గిలింది అంటూ శ్రీను కామెంట్ చేయ‌డం ఇక్క‌డ హాట్ టాపిక్‌.

దీంతో ఇప్పుడు వీళ్లిద్ద‌రు మంచి ఫ్రెండ్సా ? లేదా యాక్ట‌ర్ / మేనేజ‌ర్ టైప్ రిలేష‌న్ షిప్ ఏదైనా వీరి మ‌ధ్య ఉందా ? అన్న డౌట్లు చాలా మందికి క‌లుగుతున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. మ‌రి వీరిద్ద‌రిని క‌లిపి ఆలీ ఎందుకు ఇంట‌ర్వ్యూ చేశాడు ? అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే..!

ఇక్క‌డ మ‌రో ట్విస్టు కూడా ఉంది. ఆలీ మామూలుగానే ఆ రూమ‌ర్ రాయండి.. ఈ రూమ‌ర్ రాసుకోండ‌ని బాంబులు పేలుస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఓ రూమ‌ర్‌కు ఊత‌మిచ్చే కాంబినేష‌న్ సెట్ చేసి ఇంటర్వ్యూ చేయ‌డంతోనే ఈ పుకార్లు, షికార్లు వ‌స్తున్నాయి. అయితే ఇక్క‌డే మ‌రొక‌టి కూడా ఉంది.. ఇలా ట్విస్టులు ఇస్తేనే ఆ ఇంట‌ర్వ్యూలు బాగా పేల‌తాయ‌న్న‌ది తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news