Moviesకాంతారా సినిమా అందుకే వదులుకున్న .. రష్మిక కి అంత తలపొగరా..?...

కాంతారా సినిమా అందుకే వదులుకున్న .. రష్మిక కి అంత తలపొగరా..? కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మూవీ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 30 న కన్నడ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . కాగా ఈ సినిమా చాలా న్యాచురాలిటీగా ఉండడం.. ప్రతిక్షణం సస్పెన్స్ గా ఉండడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, ఈ క్రమంలోనే ఈ సినిమాను రీసెంట్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశారు మేకర్స్.

కాగా భారీ అంచనాల నడుమ తెలుగులో డబ్ అయిన ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు జనాలను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది సప్తమి గౌడ . కాగా ఈ సినిమాలో మొదట హీరోయిన్గా అనుకునింది రష్మిక మందన్నానట. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేదు అంటూ చెప్పి సినిమా రిజెక్ట్ చేసిందట.

అంతేకాదు పుష్ప సినిమాలో కూడా డి గ్లామరస్ లుక్ లో నటించింది ..కాగా ఈ సినిమాలో కూడా డీ గ్లామరస్ లుక్ లోనే నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని ఆమె చెప్పి సినిమా నుంచి తప్పుకుందట. అయితే అసలు రీజన్ మాత్రం వేరేగా ఉంది అంటున్నది కన్నడ మీడియా. నిజానికి ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. అంతేకాదు సప్తమి గౌడ ఈ సినిమా కోసం 50 లక్షల పారితోషకంగా తీసుకుందట.

నిజానికి రష్మిక ప్రస్తుతం ఒక సినిమాకు నాలుగు కోట్ల పారితోషకం తీసుకుంటుంది. మరి అలాంటి రష్మిక కు ఈ ఆఫర్ చేస్తే మహా అయితే రిషబ్ శెట్టి కోటి రూపాయలు ఇచ్చి ఉండేవాడు . ఆ కారణంగానే రష్మిక ఆఫర్ ను వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే బయటకు మాత్రం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ అని ..డీ గ్లామరస్ రోల్ అని.. ఆ కారణంగా నటించలేదని చెప్తూ తప్పించుకుంటుందట. ఏది ఏమైనా సరే సొంత గడ్డపై రష్మిక ఇలాంటి నిందలు వేసుకోవడం నిజంగా ఆమె కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. మరి చూడాలి రష్మిక ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news