Moviesడ‌బ్బుల కోసం మ‌రీ బ‌రి తెగించేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్స్... ఏం చేస్తున్నారో...

డ‌బ్బుల కోసం మ‌రీ బ‌రి తెగించేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్స్… ఏం చేస్తున్నారో తెలుసా..!

ఇంతకముందు కంటే ఇప్పుడు కొందరు హీరోయిన్స్ మరీ బరి తెగించెస్తున్నారనీ సోషల్ మీడియాలోనూ, బయట జనాలలోనూ గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో హీరోయిన్స్ ఎంత పద్దతిగా కనిపించేవారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జనరేషన్‌లో కాస్త ఐటెం సాంగ్స్ చేస్తూ అలరించేవారు. అయితే, అందులో ఎప్పుడూ హద్దులు మీరిన దాఖలాలేవీ లేవు. డిస్కో శాంతి సైతం పెళ్లి తర్వాత కూడా ఐటెం సాంగ్స్ చేస్తే తన భర్తతో సెట్స్‌కి వచ్చేవారు.

డిస్కో శాంతి ఎంతటి గొప్ప పర్ఫార్మరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత గ్లామర్ రోల్స్ చేసినా, ఐటెంస్ సాంగ్స్ చేసినా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకునేవారు. ఇక రెమ్యునరేషన్ బట్టి అందాల ఆరబోత చేసే దిక్కుమాలిన ఆలోచనా ధోరణిలో ఉండేవారు కాదు. డబ్బు ఇచ్చేదాన్ని బట్టి సాంగ్స్ ఎంచుకోవడం గానీ, ఒంటిమీద బట్టల సైజు తగ్గించడం గానీ చేవారు అప్పట్లో లేరనే చెప్పాలి. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతీదానికి ఓ లెక్క వేసుకొనే మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కమిటవుతున్నారు.

స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్నవారు కూడా అదనంగా డబ్బు సంపాదించడానికి ఐటెం సాంగ్స్ కమిటవుతున్నారు. అంతేకాదు, పాటలో ఎలాంటి కాస్ట్యూంస్ వేసుకోవాలి, హీరోతో లిప్ కిస్సులిస్తూ రొమాన్స్ చేయాల్సి ఉంటుందా..? అనే కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకొనే రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఇక వ్యక్తిగత సిబ్బందికి.. పనులకి అదనంగా పుచ్చుకుంటున్నారు.

అంతేకాదు, ఆన్‌స్క్రీన్ మీద కనిపించే కొన్ని సన్నివేశాలను అభ్యంతరం లేకుండా ఒప్పుకుంటున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా కొన్ని విషయాలలో డబ్బుకోసం బరితెగించినట్టే ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక మ్యాగ్జైన్స్ మీద కవర్ పేజీ ఫొటో షూట్స్ కోసమైతే ఎలాంటి ఫోజులిస్తున్నారో చూస్తున్నారో.

పూజా హెగ్డే ఆ మధ్య వేసిన బికినీ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటీవల రష్మిక మందన్న మాల్దీవులలో చేయించుకున్న ఫొటో షూట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమాలో ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే. అవకాశాల కోసం అంతగా దిగజారుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news