Moviesవాడితో అలా ఎలా..నేను ఓ అందగత్తెను.. కేవలం ఆ ఇద్దరితో మాత్రమే...

వాడితో అలా ఎలా..నేను ఓ అందగత్తెను.. కేవలం ఆ ఇద్దరితో మాత్రమే ..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కి మించిన అందంతో క్యారెక్టర్ ఆర్టిస్టులు చెలరేగిపోతున్నారు. వయసు చిన్నగానే ఉన్నా సరే అవకాశాలు అందుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన ముద్దుగుమ్మలు బోలెడు మంది అందులో ఒకరే ఈ ప్రగతి. అందరికీ ఈ పేరు సుపరిచితమే . పలు సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రగతి.. ట్రెడిషనల్ గా మోడరన్ గా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తూ ఉంటుంది.

కాగా కరోనా లాక్ డౌన్ టైంలో ప్రగతి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. తన వర్కౌట్ వీడియోస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు అప్పుడే ప్రగతి అసలు వయసు బయట పడింది. అప్పటివరకు ఈమె వయసు ఆంటీ ఏజ్ అనుకున్న వాళ్లు ఆ తర్వాత హీరోయిన్ వయసే అంటూ క్లారిటీకి వచ్చారు. రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది .దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ ..హోస్స్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మాటలు వైరల్ గా మారాయి .మనకు తెలిసిందే ప్రగతి మొదట్లో హీరోయిన్గా నటించింది . అయితే చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆమె హీరోయిన్గా కనిపించింది. ఇదే విషయాన్ని హోస్ట్ ప్రశ్నించగా ..”నాకు అవకాశాలు వచ్చాయి. కానీ నేను కమల్ హాసన్ , రజనీకాంత్ అయితేనే చేస్తానని చెప్పాను . వేరొకరితో చేయను అని చెప్పాను . ఈ క్రమంలోనే వేరే వాళ్ళు వేరే హీరోని సెలెక్ట్ చేసుకు వచ్చారు.. వీడితో నటించను అని డైరెక్ట్ గా డైరెక్టర్ ముఖాన్నే చెప్పాను , అప్పటితో నాకు సినిమా అవకాశాలు ఆగిపోయాయి” అంటూ చెప్పుకొచ్చింది .

అంతేకాదు మీరు చిన్న వయసే కదా మరి హీరోయిన్ గా ట్రై చేశారు సడన్గా ఎందుకు మదర్ రోల్ కి ఓకే చేశారు అని అడగ్గా ..” మదర్ రోల్ చేసిన నేను అందగత్తెనే ..నేను అలాగే ఫీల్ అవుతాను ..నాకు ఏ సినిమాలో ఆఫర్ వస్తే అవే చేస్తాను ..అందమే సినిమా ఇండస్ట్రీలో ఒక బిగ్ ఫ్యాక్టర్” అంటూ ప్రోమోను కట్ చేస్తారు . మరి ఫుల్ ఇంటర్వ్యూలో ఆమె ఇంకెన్ని ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news