Moviesనేను అందుకు పనికిరానట..కత్రీన కన్నీరు ..వీడియో వైరల్..!!

నేను అందుకు పనికిరానట..కత్రీన కన్నీరు ..వీడియో వైరల్..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ కథని రాసుకున్నాక ..అందులో హీరో హీరోయిన్లుగా స్టార్స్ ని అనుకుంటారు . అయితే కొన్ని కారణాల చేత ఆ స్టార్స్ ఆ కథలో నటించలేరు . కాల్ షీట్స్ బిజీగా ఉన్న కారణంగా కావచ్చు ..లేదా స్టోరీ వాళ్లకు నచ్చక కావచ్చు ..కారణమేదైనా కానీ అలా ఓ ప్రాజెక్టు నుంచి ఓ హీరోయిన్ అనుకున్నాక వేరే హీరోయిన్లు చేసి హిట్టు కొడితే ..ఆ బాధ వర్ణాతీతం . అయితే అలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్.

మనకు తెలిసిందే బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ హీరోయిన్స్ లిస్టులో కత్రినా కైఫ్ ఒకరు . ఇప్పటికీ కత్రినా కైఫ్ అందానికి పడిపోయే జనాలు బోలెడు మంది ఉన్నారు. రీసెంట్గా ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది . ఈ క్రమంలోనే ఆమెను “సాయా” చిత్రం నుంచి తొలగించడం పై సంచలన కామెంట్స్ చేసింది.

కత్రినా మాట్లాడుతూ..” మొదటగా సాయా చిత్రంలో ఆమెను హీరోయిన్గా అనుకున్నారట . అంతేకాదు ఆమెపై ఒక షాట్ తీసి డైరెక్టర్ ఓకే అని చెప్పారట . కానీ కొన్ని దుష్టశక్తులు కారణంగా ఆమెను ఆ సినిమాలో నుంచి తీసేసారని ..ఆ క్యారెక్టర్ కి నేను పనికి రాను అని చెప్పారని దీంతో ఒక్కసారిగా నాకు ఏడుపొచ్చిందని.. ఆ క్యారెక్టర్ కి నేను ఎంతో కనెక్ట్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇలా తన కెరీర్లు చాలా జరిగాయని కత్రినా చెప్పుకొని రావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు కత్రీనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని అంతా అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా కత్రినా తనకు జరిగిన అవమానాన్ని బయట పెట్టడంతో బాలీవుడ్ మీడియా షేక్ అయింది. అంతేకాదు “కెరియర్ మొదట్లో నువ్వు నటివి కాలేదు నీలో చెప్పుకునే అంత టాలెంట్ లేదు నీది గొప్ప ఫిగర్ కాదు “అంటూ ఆమె ముఖం మీద సూటిగా చెప్పేసారట ఆ మాటలను గుర్తు చేసుకుని బాధపడింది కత్రినా. త్వరలోనే కత్రినా “ఫోన్ బూత్” అనే సినిమా ద్వారా జనాలను పలకరించబోతుంది . నవంబర్ 4 న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news