Moviesభార్య‌కు తెలిసే మ‌రో మహిళ‌తో ఎఫైర్ న‌డిపిన ప్ర‌భాక‌ర్..అలా జ‌రగ‌డంతోనే వ‌దిలేశాడ‌ట‌..?

భార్య‌కు తెలిసే మ‌రో మహిళ‌తో ఎఫైర్ న‌డిపిన ప్ర‌భాక‌ర్..అలా జ‌రగ‌డంతోనే వ‌దిలేశాడ‌ట‌..?

సినిమా తారలతో పాటు చాలామంది సీరియల్ నటీనటులు కూడా అంతటి గుర్తింపును సాధించుకున్నారు. సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక బుల్లితెర ద్వారానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటులలో ప్రభాకర్ కూడా ఒకరు. ప్రభాకర్ మొదట ఈటీవీ సీరియల్స్ లో నటించేవారు. ఆ తర్వాత కొన్ని ఇష్యూల వల్ల అక్కడనుండి బయటకు వచ్చి ఇతర ఛానల్స్‌లో సీరియల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటించడంతో పాటు దర్శకత్వం మరియు నిర్మించడం కూడా చేస్తున్నారు.

రీసెంట్ గా ప్రభాకర్ తన కొడుకును హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాకర్ కొడుకు ఆటిట్యూడ్ చూసి నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అస‌లు ఒక్క సినిమా కూడా చేయ‌కుండానే ప్ర‌భాక‌ర్ కొడుకు ఇంత గ‌ర్వంగా ఫీల‌వుతున్నాడేంట్రా బాబు అని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే గతంలో ప్రభాకర్ ఓ సీరియల్ నటితో ఎఫైర్ నడిపినట్టు టాలీవుడ్ లో కథనాలు వచ్చాయి.

కాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాకర్ తన భార్యతో రిలేషన్షిప్ మరియు ఓ అమ్మాయితో ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన జీవితంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి తన జీవితంలోకి వచ్చిన మరో వ్యక్తి మరియు తన భార్య కారణమని ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. తాను ఓ మహిళతో రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆ విషయం తెలిసి తన భార్య చాలా బాధపడిందని చెప్పాడు. తనకు ఇంకొకరితో రిలేషన్ ఉండటం వల్ల తన భార్య చాలా బాధపడిందని ఏడ్చింది అని చెప్పాడు.

అది ఎలా జరిగిపోయిందో జరిగిపోయిందని అన్నారు. తన భార్యను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించానని చెప్పారు. కానీ ఆమె కన్విన్స్ కాలేదని…. తాను ఎప్పుడూ తన భార్యను అవాయిడ్ చేయలేదని చెప్పారు. ఇక తాను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తికి కూడా మొదటి నుండి చెబుతున్న మాట…..” నా భార్య పిల్లలే నా జీవితం” అని అన్నారు. అయినప్పటికీ ఆమె ఆ విషయం తనకు తెలుసని చెప్పిందని…. అలా రిలేషన్ కంటిన్యూ అయిందని చెప్పారు. దేవుడి దయవల్ల ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఆ తర్వాత ఆమె లైఫ్ బాగుందని చెప్పారు.

తాను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం తన భార్య కల్పించిందని చెప్పారు. కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని… మనం మంచి చేస్తే మంచి జరుగుతుందని ప్రభాకర్ అన్నారు. జీవితంలో తన భార్య వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పారు. అదేవిధంగా తాను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి వల్ల కూడా నేర్చుకున్నానని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news