Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి కొత్త న్యూస్ బ‌య‌ట‌కొచ్చిందే... !

జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి కొత్త న్యూస్ బ‌య‌ట‌కొచ్చిందే… !

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి పెద్ద‌గా వివ‌రాలేం బ‌య‌ట‌కు రావు. ఆమె హ‌రికృష్ణ‌కు రెండో భార్య‌గా మాత్ర‌మే చాలా మందికి తెలుసు. అస‌లు షాలిని హ‌రికృష్ణ జీవితంలోకి ఎలా ? వ‌చ్చింద‌న్న‌ది కాస్త ఆస‌క్తిక‌ర‌మే. తాజాగా షాలిని గురించి క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ కాంతారా సినిమా హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి చెప్పిన విష‌యంతో ఆమె గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

 

షాలినిది క‌ర్నాట‌క‌లోని విద్వాంసుల కుటుంబం. ఆమెకు శాస్త్రీయ సంగీతం బాగా వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ త‌న కుటుంబంలో ఉన్న మ‌న‌వ‌రాళ్లు, మ‌న‌వ‌ళ్ల‌కు సంగీతం నేర్పించాల‌ని డిసైడ్ అయ్యారు. అలా షాలిని ఎన్టీఆర్ కుటుంబంలోకి పిల్ల‌ల‌కు సంగీతంలో శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌తి రోజు ఆమె డ్యూటీ పూర్త‌య్యాక హ‌రికృష్ణే స్వ‌యంగా ఆమెను కారులో స్వ‌యంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటివ‌ద్ద దిగ‌బెట్టేవారు.

ఈ క్ర‌మంలోనే ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింది. అలా ఆమె హ‌రికృష్ణ‌కు రెండో భార్య అయ్యింది. ఆమె అంత గొప్పింటి కోడ‌లు అయినా… రెండో భార్య కావ‌డంతో ఎప్పుడూ ప‌రిధిమీరి ప్ర‌వ‌ర్తించ‌లేదు.. హ‌ద్దులు దాట‌లేదు. ఎంతో అణుకువ‌తో, సౌమ్యంగా ఉంది. ఈ దంప‌తుల‌కే జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టాడు. ఇక షాలిని ఎప్పుడో కాని బ‌య‌ట క‌న‌ప‌డ‌రు. ఆమె త‌న కొడుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే క‌లిసి ఉంటోంది.

ఆమె గురించి కాంతారా సినిమా ద‌ర్శ‌కుడు రిషిబ్ శెట్టి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట పెట్టారు. ఆమె క‌ర్నాక‌ట‌లోని బృందాపూర్‌కు చెందిన వార‌ట‌. తెలుగులో త‌న ఫేవ‌రెట్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అని చెప్పిన రిషిబ్‌.. వారి త‌ల్లి షాలిని గారు త‌మ ప్రాంత‌మైన బృందాపూర్‌కు చెందిన వారు అన్నాడు. దీంతో వెంట‌నే యాంక‌ర్ రీజ‌న‌ల్ ఫీలింగ్ చూపించారా ? అని ప్ర‌శ్నించగా అంద‌రూ న‌వ్వేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news