Moviesబుల్లితెర నటుడి రాసలీలలు..ముద్దులు పెడుతూ..చెత్తమాటలు ..ఆడియో లీక్..!!

బుల్లితెర నటుడి రాసలీలలు..ముద్దులు పెడుతూ..చెత్తమాటలు ..ఆడియో లీక్..!!

వెండితెరపై కాదు బుల్లితెరపై కూడా యువజంటలు యమ స్పీడుగా ఉన్నారు. చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకోవడం పెళ్లి చేసుకున్నాక గుట్టూ చప్పుడు కాకుండా కాపురాలు పెట్టేయడం.. ఈ కాలం జనరేషన్ కు అలవాటైపోయింది . కాగా రీసెంట్ గా కోలీవుడ్ సీరియల్ దివ్త-అర్ణవ్ ల మేటర్ మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి దివ్యా-అర్ణవ్ ల మ్యాటర్ ముదిరిపోతుంది . మనకు తెలిసిందే అర్ణవ్-దివ్య ఓ సీరియల్ లో నటిస్తూ ప్రేమించి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేశారు. వీళ్ల కాపురం ఎఫెక్ట్ ఇప్పుడు దివ్య ప్రెగ్నెంట్ గా ఉంది . అయితే అర్ణవ్ మాత్రం దివ్యాని పట్టించుకోకుండా వేరే అమ్మాయి అన్షితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే అసలు మేటర్ అర్థం చేసుకున్న దివ్య ..అర్ణవ్ పై పోలీస్ కేసు పెట్టింది. అంతేకాదు తమ వివాహం అఫీషియల్ అంటూ పక్క ప్రూఫ్ తో పోలీసులు ముందు ఆధారాలు తీసుకొచ్చింది. అంతేకాదు అన్షితతో రాసలీలలు సాగించడం పై దివ్య ఫైర్ అయింది.తాను గర్భవతిగా ఉన్నా కూడా తనను తన భర్త వేధిస్తున్నాడని పోలీసులు ముందట చెప్పి కన్నీరు పెట్టుకున్నింది. ఈ క్రమంలోనే తాజాగా దివ్య అన్షిత అరణవ్ ల మధ్య జరిగిన ఆడియో కాల్ నెట్టింట లీక్ అయ్యింది.

ఈ ఆడియో కాల్ ఆధారంగా దివ్య-అన్షిత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. దివ్య.. అన్షిత తో “ఒక ఆడదానివై ఉండి మరో ఆడదాని జీవితాల్లో నిప్పులు పోస్తావా.. నీకు సిగ్గు లేదా..” అంటూ ఆమెను తిట్టడం.. మనం ఆడియో లో వినచ్చు . అంతేకాదు నీకు దండం పెడతాను ప్లీజ్ నా భర్తను వదిలేయ్ అని దివ్య చెప్తుండగా.. ఛీ ఛీ నీలాంటి ఆడదాన్ని కొట్టి చంపాలి అన్నంత కోపంగా ఉంది నాకు అని అన్షిత బదులిచ్చింది.

నా భర్త నుంచి మా జీవితంలో నుంచి బయటకు వెళ్లాలని దివ్య చెప్తుండగా.. దివ్య ముందే కావాలని ఆమె రెచ్చగొడుతూ అర్ణవ్ కు ఐ లవ్ యూ చెప్పి ముద్దులు పెడుతుంది. దీనితో కోపం వచ్చిన దివ్య ఆమెను బూతులు తిడుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే వీళ్ళ బాధ ఎలా ఉన్న ఆడియన్స్ కు మాత్రం ఫుల్ బిందాస్ గా ఉంది. ఒక మగాడి కోసం కొట్టుకు చస్తున్న ఆడవాళ్లు అంటూ క్యాప్షన్లు ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news