Moviesఆ సీరియ‌ల్ న‌టితో జ‌గ‌ప‌తిబాబు ల‌వ్ ఎఫైర్... ఆ వార్త‌లు ఎందుకు...

ఆ సీరియ‌ల్ న‌టితో జ‌గ‌ప‌తిబాబు ల‌వ్ ఎఫైర్… ఆ వార్త‌లు ఎందుకు వ‌చ్చాయి..?

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోలుగా రాణించిన వారిలో జగపతిబాబు కూడా ఒకరు. జగపతి బాబు తండ్రి సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత విబి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆయన వారసత్వంగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా సినిమాల్లో తనదైన స్టైల్ లో రాణించి ఫ్యామిలీ హీరోగా మెప్పించాడు. జగపతి బాబు కేవలం ఓకే రకమైన పాత్రలు చేయకుండా అన్ని రకాల పాత్రల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోగా రొటీన్ సినిమా లు చేయకుండా కామెడీ సినిమాలలో సైతం నటించి ప్రేక్షకులను నవ్వించారు.

ఆ రోజుల్లోనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు కూడా చేసేవాడు. అయితే జగపతి బాబు హీరోగా కంటే విలన్ గానే ఎక్కువగా సక్సెస్ అయ్యారు. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జగ్గూ బాయ్ హీరోగా చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో చివరికి సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. అలాంటి సమయం లో బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత విలన్ గానే కంటిన్యూ అవుతున్నాడు..కేవలం నెగిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా పాజిటివ్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా జగపతి బాబు సినిమాల గురించి చాలా మందికి తెలుసు కానీ… ఆయన పర్సనల్ విషయాల గురించి మాత్రం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. పెద్ద కూతురు వివాహం విదేశీయుడితో జరిపించాడు. ఇక జగపతి బాబుకు ఓ హీరోయిన్ తో అఫైర్ ఉంది అని కూడా అప్పట్లో టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అయితే ఆ హీరోయిన్‌తో మాత్ర‌మే కాకుండా… తెలుగు సీరియల్స్ లో ఫుల్ బిజీగా ఉండే మ‌రో హీరోయిన్ తో కూడా జగపతి బాబు ప్రేమాయణం నడిపించారట.

అంతే కాకుండా ఆ హీరోయిన్ జగపతి బాబు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది అని టాక్. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ఆ హీరోయిన్ తో ప్రేమలో పడిపోయారట. ఆ తర్వాత చాలా కాలం ఇద్దరూ హ్యపీగా గడిపారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు అని తెలుస్తోంది. అయితే జగపతి బాబు.. ఆ సీరియ‌ల్ న‌టి విడిపోయినా కూడా ఆమె అంటే బాబుకి ఇప్ప‌ట‌కీ ఇష్టం ఉంద‌నే అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news