Moviesహీరోయిన్ ఇంద్రజపై ప్రేమతో ఆమె భర్త చేసిన పని తెలిస్తే దండం...

హీరోయిన్ ఇంద్రజపై ప్రేమతో ఆమె భర్త చేసిన పని తెలిస్తే దండం పెట్టాల్సిందే…!

ఇంద్రజ..చెన్నై లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇంద్రజ అసలు పేరు రజతి. ఈమె ఎక్కువగా తెలుగు, మలయాళ సినిమాల్లో కనిపించినా కన్నడ మరియు తమిళ చిత్రాల్లో సైతం నటిచింది. చిన్న తనం నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్న ఇంద్రజ మాధవపెద్ది మూర్తి గారి దగ్గర నాట్యంలో శిక్షణ పొందింది. ఇక ఇంద్రజ గాయని కూడా కావడం విశేషం. ఇంద్రజ పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ 1995 నుంచి ఒక పదేళ్ల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగింది.

ఉజయ్ప్పల్లి అనే తమిళ సినిమా ద్వారా నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో పరిచయం అయ్యింది. మొదటి రెండు సినిమాలు తమిళంలోనే చేసిన హలో బ్రదర్ సినిమాతో తెలుగులో కూడా పరిచయం అయ్యిది.
కమెడియన్ అలీ కి హీరోయిన్ గా కూడా ఆమె యమలీల వంటి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. చూపు తిప్పుకోలేని అందంతో, మత్తు కళ్లతో సౌత్ ఇండియా లోని అన్ని భాషల్లో సెటిల్ అయ్యి ఒక 1995 లో ఏకంగా 15 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది.

కెరీర్ మొత్తంగా వందకు పైగా సినిమాల్లో నటించిన ఇంద్రజ 2007 ఫుల్ ఫామ్ తో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక ఏడేళ్ల వరకు సినిమాలకు దూరం అయినా ఇంద్రజ‌కు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు సారా. ఇక ఇంద్రజ భర్త పేరు మొహమ్మద్ అబ్సర్. ఇతడు బిజినెస్ చేస్తూనే కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. కానీ ప్యూర్ బ్రాహ్మిన్ అయినా ఇంద్రజ ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.

ఇండస్ట్రీ సంగతి పక్కన పెడితే ఆమె ఇంట్లో సైతం పెళ్ళికి ఎవరు ఒప్పుకోలేదు. నేటి వరకు కూడా ఇంద్రజ పెళ్లిని ఆమె కుటుంబం ఒప్పుకోకపోవడం విశేషం. తనతో ఒక సీరియల్ లో నటిస్తున్న అబ్సర్ తో ఇంద్రజ షూటింగ్ లొకేషన్ లోనే ప్రేమలో పడింది. అతడి వ్యక్తిత్వం నచ్చి మనసు పడింది. అతడికి స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అలవాటు లేకపోవడం కూడా ఇంద్రజకు ఎంతగానో నచ్చింది. ఇక వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వారి అనుమతి కోసం ఆరేళ్ళ పాటు ఎదురు చూసిన వారు ఒప్పుకోలేదు.

దాంతో ఇక చేసేదేం లేక రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న ఈ దంపతులకు వారి కుటుంబం మాత్రం దూరంగానే ఉంటుంది. ఇక అబ్సర్ కుటుంబానికి మాత్రం ఇంద్రజ అంటే ఎనలేని ప్రేమ. ఇంద్రజ పూర్తి శాకాహారి కావడంతో ఆమె కోసం అబ్సర్ కుటుంబం సైతం పూర్తిగా నాన్ వెజ్ మానెయ్యడం కూడా ఆమెపై వారికున్న ప్రేమను తెలియచేస్తుంది. కానీ ఇంట్లో మాత్రమే వండుకోవడం నిషేధం.. కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తినవచ్చు అనే కండిషన్ కూడా పెట్టిందట ఇంద్రజ. ఇక ప్రస్తుతం ఇంద్రజ బుల్లి తెర పైన ఫుల్ బిజీ గా ఉంది. హోస్ట్ చేస్తూ, జడ్జ్ గా కూడా వ్యవహరిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె చేతిలో సినిమాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news