Moviesఆ హీరోయిన్‌కి పెళ్ళి కాకపోయి ఉంటే వెంకీ లాంటీ హీరోలెంతమందో..?

ఆ హీరోయిన్‌కి పెళ్ళి కాకపోయి ఉంటే వెంకీ లాంటీ హీరోలెంతమందో..?

మన సౌత్‌లో పెళ్ళైన హీరోయిన్ అంటే చాలా మంది అంతగా ఆసక్తి చూపించరు. అందులోనూ ఫాంలో లేని హీరోయిన్ అంటే మరీ లెక్కలేనితనం అనుకోవచ్చు. అసలు లెక్క చేయరు. దీనికి రకరకాల కారణాలుంటాయి. ముఖ్యంగా పెళ్ళైన హీరోయిన్స్ చాలామంది ఫ్యామిలీ లైఫ్ ని త్యాగం చేయాలనుకోరు. అదీ కాక స్క్రీన్ మీద హీరోలతో రొమాన్స్ చేయాలంటే అడ్డు చెబుతుంటారు. రొమాంటిక్ సీన్స్, హీరోలతో లిప్ కిస్సులు..బెడ్రుం సీన్స్ లాంటివి చేయాలంటే నో అనేస్తారు.

సాంగ్స్‌లో కూడా అందాల ప్రదర్శన అంటే ససేమిరా అని నిర్మొహమాటంగా తేల్చి చెప్పేస్తారు. అందుకే, మన సౌత్‌లో అందుకోనూ మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎప్పుడు కూడా సింలా యాపిల్‌లా ఉండే ముంబై మోడల్స్‌నే దిగుమతి చేసుకుంటుంటారు. వీరూ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగరు. సక్సెస్ వచ్చిన ఏ కొద్దిమందో తప్ప. పెళ్లి తర్వా హీరోయిన్‌గా నటించి హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో వినీత ఒకరు.

ఈ అమ్మడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సెకండ్ లీడ్‌గా నటించింది. వాస్తవంగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా సౌందర్య నటించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకి దివంతగ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. అయితే, సెకండ్ లీడ్ కోసం కూడా అప్పట్లో సౌందర్య తో పాటుగా చాలామంది స్టార్ హీరోయిన్స్‌ను మేకర్స్ ట్రై చేశారట.

కానీ, సౌందర్య మేయిన్ హీరోయిన్ కాబట్టి..కథలో అంతగా ప్రాధాన్యం ఉండదని నో చెప్పారట. చాలామందిని చూసి తప్పని పరిస్థితుల్లో వినీతను ఎంచుకున్నారట. అయితే, తెలుగులో పెద్దగా తెలియకపోయినా ఆ సమయంలో తమిళంలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వినీత చాలా బిజీగా ఉంది. ఆ కారణంతోనే తెలుగులో నటించడానికి తీసుకున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

సౌందర్యతో పాటుగా వినీతకి చాలామంచి పేరొచ్చింది. కానీ, ముదురు భామ కావడంతో యంగ్ హీరోల సరసన నటించడానికి వీలవలేదు. అసలు ముఖ్యం ఏంటంటే పెళ్ళైన హీరోయిన్ మనకెందుకు అనే భావన వల్ల అవకాశాలు కూడా ఇవ్వలేదట. లేకపోతే, వినీత వెంకటేష్ సరసన నటించినట్టుగానే మిగతా స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకునేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news