Movies' గాడ్ ఫాద‌ర్ ' మూవీ ప్ల‌స్‌లు... మైన‌స్‌లు ఇవే... చిరు...

‘ గాడ్ ఫాద‌ర్ ‘ మూవీ ప్ల‌స్‌లు… మైన‌స్‌లు ఇవే… చిరు హిట్ కొట్టాడా… లేదా…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన సినిమా గాడ్ ఫాద‌ర్‌. మ‌ల్లూవుడ్‌లో మోహ‌న్‌లాల్ హీరోగా తెర‌కెక్కి హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా ఈ గాడ్ ఫాద‌ర్ తెర‌కెక్కింది. మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 92 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ రోజు నాగార్జున ది ఘోస్ట్‌, బెల్లంకొండ గ‌ణేష్ స్వాతిముత్యం సినిమాల‌తో పోటీప‌డుతూ థియేట‌ర్ల‌లోకి దిగింది.

ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం సినిమాకు పాజిటివ్ వైబ్స్ అయితే వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే లూసీఫ‌ర్ సినిమా చూసిన వాళ్ల‌కు గాడ్ ఫాద‌ర్ పెద్ద‌గా న‌చ్చ‌ద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆచార్య డిజాస్ట‌ర్ త‌ర్వాత వ‌స్తోన్న గాడ్ ఫాద‌ర్‌పై అనుకున్న రేంజ్‌లో అయితే ప్రి రిలీజ్ బ‌జ్ లేదు. దీనికి తోడు ఇది రీమేక్ సినిమా కావ‌డంతో ఎక్కువ మంది ఈ సినిమాను చూసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు.

ఫ‌స్టాఫ్ సినిమాకు హైలెట్ అంటున్నా… సెకండాఫ్‌లో కొన్ని సీన్లు అంత‌గా మెప్పించ‌లేద‌నే అంటున్నారు. లూసీఫ‌ర్‌లో మోహ‌న్‌లాల్ త‌క్కువ టైం క‌నిపిస్తారు. అయితే ఈ సినిమాలో చిరు ఏకంగా 2 గంట‌ల‌కు పైగా స్క్రీన్ ప్రెజెన్సీతో ఉంటాడు. ఇక ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ జ‌ర్న‌లిస్టుగా త‌క్కువ టైం క‌నిపించినా అత‌డి పాత్ర ఆక‌ట్టుకుంది. థ‌మ‌న్ బీజీఎంతో పాటు న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇక స‌ల్మాన్‌ఖాన్ రోల్ సినిమాకు స్పెష‌లే అయినా అత‌డి పాత్ర‌లో అనుకున్నంత డెప్త్ లేదు. స‌ల్మాన్ పాత్ర అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా లేదు. ద‌ర్శ‌కుడు మోహ‌న‌రాజా క్లైమాక్స్ వీక్ గా డిజైన్ చేశాడ‌ని… మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండాల్సింద‌న్న కామెంట్లు వ‌స్తున్నాయి. ఇక సినిమా ర‌న్ టైం ఏకంగా 2.37 గంట‌ల పాటు ఉంది. ఎడిటింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే సినిమాకు మ‌రింత హెల్ఫ్ అయ్యి ఉండేది.

సినిమా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం మంచి విజువ‌ల్ ఫీస్ట్‌. చిరు న‌ట‌న‌, ఎక్స్‌ప్రెష‌న్లు, స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార‌, థ‌మ‌న్ బీజీఎం, ఫ‌స్టాఫ్ సినిమాకు హైలెట్స్‌. సెకండాఫ్‌, క్లైమాక్స్‌, స‌ల్మాన్‌ఖాన్ సినిమాకు మైన‌స్ అయ్యాయి. ఓవ‌రాల్‌గా సినిమా జ‌స్ట్ ఓకే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news