Moviesవాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి వార్‌లో ఈ ట్విస్టులు...

వాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి వార్‌లో ఈ ట్విస్టులు చూశారా…!

టాలీవుడ్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి న‌టిస్తోన్న రెండు సినిమాలు 2023 సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం దాదాపు ఫిక్స్ అయ్యింది. చిరంజీవి న‌టిస్తోన్న చిరు 154 వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య న‌టిస్తోన్న వీర సింహారెడ్డి రెండు సినిమాలు సంక్రాంతి కానుక‌గానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. చిరు సినిమా సంక్రాంతికి వ‌స్తున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఇక తాజాగా బాల‌య్య సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్తో పాటు త‌మ సినిమా కూడా సంక్రాంతికే వ‌స్తుంద‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో సంక్రాంతికి ఈ ఇద్ద‌రు క్రేజీ హీరోల సినిమాల‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ మామూలుగా హీటెక్క‌ద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఆదిపురుష్ సైతం సంక్రాంతికే వ‌స్తోంది. ఈ మూడు సినిమాల‌తో పాటు కోలీవుడ్ హీరో విజ‌య్ తెలుగు డెబ్యూ మూవీ వార‌సుడు కూడా పొంగ‌ల్ బ‌రిలోనే దిగ‌నుంది. దీంతో ఈ నాలుగు సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ వార్ మ‌జా అయితే హోరెత్తిపోనుంది. ఇక బాల‌య్య‌, చిరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితేనే ఆ పోటీ వేరుగా ఉంటుంది. అలాంటిది సంక్రాంతికి ఈ ఇద్ద‌రు హీరోలు పోటీ ప‌డితే పెద్ద యుద్ధంలాగానే ఉంటుంది.

ఆరేళ్ల క్రితం ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ల్యాండ్ మార్క్ సినిమాలు చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు సంక్రాంతికే వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి వీరి మ‌ధ్య సంక్రాంతి పోటీ త‌ప్ప‌డం లేదు. అయితే ఈ రెండు సినిమాల మ‌ధ్య కొన్ని కామ‌న్ పాయింట్స్ ఉన్నాయి.

వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి రెండు సినిమాల‌ను కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రెండు సినిమాల్లోనూ శృతీ హాస‌న్ క‌థానాయిక‌. అలాగే రెండు సినిమాల టైటిల్స్‌లోనూ వీర అన్న‌ది కూడా కామ‌న్‌గా ఉంది. ఇక ఈ రెండు సినిమాల ద‌ర్శ‌కులు కూడా ఆయా హీరోల‌కు వీరాభిమానులుగా ఉన్న ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తోన్న‌వే కావ‌డం విశేషం.

 

వాల్తేరు వీర‌య్య ఉత్త‌రాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తుంటే, వీర సింహారెడ్డి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో వ‌స్తోంది. ఇక చిరు సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంటే, బాల‌య్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇలా ఈ కామ‌న్ ట్విస్టులు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య వాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి అంటూ ట్యాగ్ వార్ స్టార్ట్ అయ్యింది. మ‌రి ఫైన‌ల్‌గా సంక్రాంతి రేసులో ఎవ‌రు విన్న‌ర్ అవుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news