Moviesరమ్యకృష్ణ కి అంత దమ్ముందా..? నందమూరి ఫ్యాన్స్ ఫైర్..ఏమైందంటే..?

రమ్యకృష్ణ కి అంత దమ్ముందా..? నందమూరి ఫ్యాన్స్ ఫైర్..ఏమైందంటే..?

నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న షో ఆన్ స్టాపబుల్ . సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రీసెంట్ గానే సీజన్ 2 మొదలుపెట్టారు ఆహా టీం. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కి బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు నాయుడు ఆయన అల్లుడు లోకేష్ వచ్చి సరదా సరదాగా సందడి చేసి కబుర్లు చెప్పుకొని గేమ్స్ ఆడుకొని వెళ్లిపోయారు. రెండో ఎపిసోడ్ కి టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వచ్చి తమదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి బాలయ్యతో చమత్కరించి ఎపిసోడ్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ కి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాకి బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా రాబోతుందట . ఈ క్రమంలోనే వీళ్లిద్దరి ఎపిసోడ్ చిత్రీకరణకు సంబంధించి కొన్ని బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఆహా వారి నుండి సమాచారం అందుతుంది . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రమ్యకృష్ణ హోస్ట్ గా మారి బాలయ్యను గెస్ట్ గా చేసి ..రమ్యకృష్ణ దగ్గర ప్రశ్నలు అడిగించే విధంగా ఆహా టీం ప్లాన్ చేస్తుందట.

అంతేకాదు నందమూరి బాలయ్య పరసనల్ ప్రశ్నలతో పాటు టాలీవుడ్ లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు .. ప్రజెంట్ పాలిటిక్స్ పై ఆయన అభిప్రాయం.. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ తెరంగేట్రంపై బాలకృష్ణ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయబోతుందట . ఇదే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే నందమూరి బాలకృష్ణ ను ప్రశ్నించే దమ్ము ధైర్యం రమ్యకృష్ణ కు ఉన్నాయా ..అంత సీన్ లేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి రమ్యకృష్ణ-బాలకృష్ణ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news