Moviesమెగా కంచుకోట‌లో బాల‌య్య‌దే పై చేయి... చిరు సీన్ రివ‌ర్స్ అయ్యిందే...!

మెగా కంచుకోట‌లో బాల‌య్య‌దే పై చేయి… చిరు సీన్ రివ‌ర్స్ అయ్యిందే…!

మెగాస్టార్ చిరంజీవికి నటించిన రీమేక్‌ సినిమా గాడ్ ఫాదర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో ఇప్పటికే హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఇప్పటికే రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించుకున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా గాడ్ ఫాదర్ 100 కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నా… సినిమా బ్రేక్ ఈవెన్‌కు వస్తుందా ? అన్న సందేహాలు చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు ఉన్నాయి. చాలా ఏరియాల‌లో సినిమా చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా వసూళ్లు రావటం లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలకు నైజం కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ బన్నీ నటించిన అలవైకుంఠపురంలో సినిమా ఏకంగా రు. 42 కోట్ల వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు సినిమాలు సైతం నైజాంలో సింపుల్‌గా రు. 30 కోట్లకు పైగా కొల్లగొట్టేస్తున్నాయి. చివరకు నైజాంలో తక్కువ మార్కెట్ ఉన్న బాలయ్య అఖండ సైతం ఏకంగా 21 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇది నిజంగా బాలయ్యకు కెరీర్ పరంగా మంచి రికార్డు. మీడియం రేంజ్ హీరోలు సైతం నైజాంలో సింపుల్‌గా రు. 20 కోట్లు కొల్లగొట్టేస్తున్నారు.

చిరంజీవి ఆచార్య‌ సినిమాకు పది కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే షేర్ వచ్చింది. ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఐదు రోజులకు కలిపి నైజాంలో కేవలం రు. 10 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అది కూడా ఐదో రోజు మూడు కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. 1.5 కోట్ల షేర్ వచ్చింది. దసరా సెలవులు ఉండడంతో పాటు సినిమాకు హిట్‌ టాక్ రావడంతో ఇప్పటివరకు రు. 10 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాను అక్కడ 22 కోట్లకు కొన్నారు.

అంటే గాడ్ ఫాదర్ నైజాంలో లాంగ్ రాన్లో మరో రు. 12 కోట్లకు పైగా షేర్ రాబడితేనే అక్కడ డిస్ట్రిబ్యూటర్ గట్టెక్కుతాడు కానీ.. సోమవారం కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. మంగళవారం బుకింగ్స్ కూడా పెద్దగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నైజాంలో గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్‌కు వచ్చే పరిస్థితి లేదు. పైగా నైజాంలో గాడ్ ఫాదర్ కొన్న వాళ్లకు భారీ నష్టాలు తప్పవని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు మెగా ఫ్యామిలీకి కంచు కోట‌లాంటి నైజాంలో బాలయ్య అఖండతో తిరుగులేని రికార్డు కొడితే… చిరు గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ చేరుకోవటానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోగా ఉన్న చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్లు వీరాభిమానుల‌కే రుచించేవిగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news