Moviesఅదే నిజం అయితే ..సాయి పల్లవి అభిమానులకు పండగే..!?

అదే నిజం అయితే ..సాయి పల్లవి అభిమానులకు పండగే..!?

ఎస్ ఒకవేళ ఇదే నిజమైతే ,,ఇది నిజంగా సాయి పల్లవి అభిమానులకు బిగ్ ఫెస్టివల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సాయి పల్లవి ఏ సినిమాకు కమిట్ అవలేదు . దీంతో సాయి పల్లవి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లే సాయి పల్లవి కూడా ఎంచక్కా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. తప్పిస్తే సినిమా ఇండస్ట్రీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ సాయి పల్లవి నావల్ల ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోతున్నారు. అలా నష్టపోవడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో సాయి పల్లవి తీసే సినిమాలు కారణంగా ప్రొడ్యూసర్ నష్టపోతున్నారని ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించిందని వార్తలు పుట్టుకొచ్చాయి . అయితే ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి అభిమానులకు ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. మనకు తెలిసిందే టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మళ్ళి ప్రారంభమైంది . ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంటాయి అంటున్నారు జనాలు. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే ఇద్దరు పవర్ స్టార్ లను ఒకే తెరపై చూడబోతున్నాం అన్నమాట. ఇది పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. అంతేకాదు క్రిష్ వీళ్లిద్దరి కాంబోలో ఓ సాంగ్ ప్లాన్ చేశారట. ఈ సాంగ్ లో పవన్, సాయి పల్లవి కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తుంది . నిజంగా ఇది సాయి పల్లవి పవర్ స్టార్ అభిమానులకు కేక పెట్టించే అప్డేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ నిజంగా సాయి పల్లవి సినిమాలో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ కి పక్క అంటున్నారు జనాలు . మరి చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news