Moviesఆ స్టార్ డైరెక్టర్ తో ఓ రోజు..బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకరమ్మ..!?

ఆ స్టార్ డైరెక్టర్ తో ఓ రోజు..బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకరమ్మ..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. హీరోగా ఉన్న స్టార్ జీరో అవ్వచ్చు.. స్టార్ గా ఉన్న హీరోయిన్ ఐరన్ లెగ్ కావచ్చు. అలా ఇప్పటికే జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొదటి సినిమాతో హిట్టు కొట్టి ఆ తర్వాత సినిమాలు తో ఫ్లాప్ కొట్టి అడ్రస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో బోలెడు మంది . అలాగే హీరోలు కూడా మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయినా క్రమీనా టైం తీసుకుని హిట్ కొట్టిన హీరోస్ చాలామంది ఉన్నారు.

అలాగే బుల్లితెర పైనుంచి వచ్చి వెండితెరపై రాజ్యమేలుతున్న సుందరీమణులు ఎంతోమంది ఉన్నారు. హీరోయిన్స్ గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం భామలుగా తమదైన స్టైల్ లో మెప్పించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . ఆ లిస్ట్ లోకే యాడ్ కాబోతుంది అందాల బొమ్మ యాంకర్ స్రవంతి. యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంకర్ గా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయిన యాంకర్ స్రవంతి.. ఆ తర్వాత క్రమీన పలువురి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది . ఈ క్రమంలోనే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

అంతేకాదు ఆ ఇంటర్వ్యూ తో వచ్చిన పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టి.. బిగ్ బాస్ లో తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించిన యాంకర్ స్రవంతి.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రచ్చ రంబోలా చేస్తుంది. ఈవెంట్లతో పాటు పలు షోలకి హోస్టుగా చేస్తూ జనాలను మెప్పిస్తుంది . అంతేనా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాల ఆరబోస్తుంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత యాంకర్ స్రవంతి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా మారిపోయిందో మనకు తెలిసిందే.

అయితే రీసెంట్గా యాంకర్ స్రవంతి ఓ అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ వైరల్ గా మారింది. అమ్మడు ఓ యంగ్ హీరోతో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ అమ్మడు ఫోటోలు చూసి అమ్మడు అందానికి ఫిదా అయిపోయి ఈ అవకాశం ఇచ్చినట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు స్రవంతి ఈ పాట చేస్తున్నందుకు గాను ఆమెకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడట ఆ స్టార్ డైరెక్టర్ . దీంతో యాంకర్ స్రవంతి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news