Moviesరానా లిప్ లాక్ వెనక ఇంత రచ్చ జరిగిందా..? అయినా జుర్రుకున్నాడుగా..!!

రానా లిప్ లాక్ వెనక ఇంత రచ్చ జరిగిందా..? అయినా జుర్రుకున్నాడుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కు సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అయిపోతాయి. అందులోనూ బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కానీ, హీరోయిన్స్ కానీ, ఎక్కడైనా కొంచెం హద్దులు మీరు నటించినా సరే సోషల్ మీడియాలో భూతద్దం పెట్టి మరీ చూపిస్తారు ట్రోలర్స్. ఇక పదే పదే ఆ స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తూ.. ఆ హీరో పరువు తీసేస్తారు. ప్రజెంట్ అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రానా దగ్గుబాటి.

ఈ హీరో కమ్ విలన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రామానాయుడు మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా లీడర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా హీరోగా నటించారు . కానీ ఆయన హీరోగా జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఆ తర్వాత రూటు మార్చి విలన్ రోల్ లో నటించాడు .జనాలకు బీభత్సంగా నచ్చేసాడు .ఇక ఇదే మనకు కరెక్ట్ అనుకున్నాడో ఏమో రానా .హీరో కన్నా విలన్ పాత్రలనే ఎక్కువ చూస్ చేసుకుంటూ టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ విలన్ గా సెటిల్ అయిపోయాడు. అంతెందుకు బాహుబలి సినిమాలో ప్రభాస్ కి ఏ రేంజ్ క్రేజ్ దక్కిందో అంతకు డబుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి.

కాగా రీసెంట్ గా రానా దగ్గుబాటి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వెంకటేష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఒరిజినల్ గా నిర్మితమవుతున్న రానా నాయుడు అనే వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది . అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంది . ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది . కచ్చితంగా ఈ సినిమాలో వెంకటేష్ నటనకి మంచి మార్కులు వేయించుకుంటారని చెప్పవచ్చు .

అదేవిధంగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి హద్దులు మీరు నటించినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోవడం టీజర్ లో చూడొచ్చు. అయితే నిజానికి రానా దగ్గుబాటి లిప్ కిస్ కి ,బెడ్ సీన్స్ కి ,బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. కానీ ఈ కంటెంట్ లో భాగంగానే రానా దగ్గుబాటి అలా చేశారని తెలుస్తుంది . అంతేకాదు దీనిపై ముందుగానే ఆమె భార్య మిహికా చెప్పడం ..ఆమె నాకు ఏం ప్రాబ్లం లేదని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రానా దగ్గుబాటి అలా ఆమెతో లిప్ లాక్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి వెబ్ సిరీస్ ద్వారా రానా వెంకటేష్ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news