Moviesవామ్మో ఏందీ అరాచ‌కం... తార‌క్‌పై రెజీనా, నివేదా కామెంట్ల మీనింగ్ ఏంటి...!

వామ్మో ఏందీ అరాచ‌కం… తార‌క్‌పై రెజీనా, నివేదా కామెంట్ల మీనింగ్ ఏంటి…!

టాలీవుడ్‌లో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు రెజీనా, నివేదా థామ‌స్ న‌టించిన శాకిని డాకిని సినిమా వ‌చ్చేవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రెజీనా, నివేద ఇద్ద‌రూ ప్ర‌మోష‌న్ల‌ను హోరెత్తిస్తున్నారు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో రెజీనా, నివేద ఇద్ద‌రూ కూడా టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ తార‌క్‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

తార‌క్ గురించి రెజీనా స్పందిస్తూ ఆయ‌న చాలా మంచోడు.. మంచి మ‌న‌సుతో అభినందించారు. అది చాలా అరుదుగా జ‌రుగుతుంద‌ని.. తార‌క్ మంచి మ‌న‌సుతోనే పుట్టాడ‌ని రెజీనా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా ఎన్టీఆర్‌, క‌మ‌ల్ ఇద్ద‌రూ కూడా చాలా విష‌యాల్లో ఒకేలా ఉంటార‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్తం చేసింది. ఎన్టీఆర్‌పై త‌న‌కు ఎంతో అభిమానం ఉందంటూ ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌శంసించేసింది.

ఇక నివేదకు ఎన్టీఆర్ ప‌క్క‌న చేసిన అనుభ‌వం ఉంది. జై ల‌వ‌కుశ సినిమాలో తార‌క్‌కు జోడీగా ఆమె న‌టించింది. తార‌క్ ఎన‌ర్జీ అద్భుతం అని.. ఎప్పుడు చూసినా కూడా అస్స‌లు అల‌సిపోడేమో అనిపిస్తుంది.. అత‌డిని చూసిన‌ప్పుడ‌ల్లా నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంద‌ని కూడా నివేద చెప్పింది. ఎన్టీఆర్ ప్ర‌తి ఒక్క‌రిని దృష్టిలో పెట్టుకుని త‌న‌కు చేత‌నైనంత సాయం చేసేందుకు ముందు ఉంటాడు.. క‌మ‌ల్ స‌ర్‌లా ఎన్టీఆర్ కూడా చాలా ఫ‌న్నీగా ఉంటాడ‌ని చెప్పింది.

ఏదేమైనా ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు తార‌క్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డంతో నంద‌మూరి, తార‌క్ అభిమానులు ఈ వీడియోను, వీరి కామెంట్ల‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. వీళ్లిద్ద‌రు ఇప్ప‌టికే దాదాపుగా ఫేడ‌వుట్ అయిపోయారు. వీళ్ల‌కు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చే ప్ర‌శక్తేలేదు. మ‌రి మ‌నోడిపై వీళ్ల‌కు స‌డెన్‌గా ఇంత ప్రేమ ఎందుకు ? పుట్టుకు వ‌చ్చిందా ? అన్న డౌట్లు కొంద‌రిలో క‌లుగుతున్నాయి.

అయితే వీరి తాజా సినిమా రిలీజ్ నేప‌థ్యంలో తార‌క్ ఫ్యాన్స్‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటే సినిమాకు హెల్ఫ్ అవుతుంద‌నే ఇంత‌లా ఆకాశానికి ఎత్తేశార‌న్న చ‌ర్చ‌లే నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news