Moviesఈ టాలీవుడ్ అక్కా, చెల్లెల్లిద్దరిదీ అదే పరిస్థితి ... ఆదుకునే హీరోలే...

ఈ టాలీవుడ్ అక్కా, చెల్లెల్లిద్దరిదీ అదే పరిస్థితి … ఆదుకునే హీరోలే లేరా..?

టాలీవుడ్‌లో ఇద్దరు అక్కాచెల్లెల్లిద్దరిదీ అదే పరిస్థితి ..వీళ్ళు స్టార్ హీరోయిన్స్‌గా నిలబడటం చాలా కష్టమనే కామెంట్స్ ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులిద్దరూ మంచి నటులు. సొంత నిర్మాణ సంస్థ ఉంది. తల్లి దర్శకురాలిగా సక్సెస్ చూశారు. అయినా తమ కూతుళ్ళను హీరోయిన్స్‌గా నిలబెట్టడం కాస్త కష్టమనే టాక్ వినిపిస్తోంది. అదెవరో కాదు డా.రాజశేఖర్ ఫ్యామిలీ. జీవిత రాజశేఖర్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. హీరోహీరోయిన్స్‌గా మాత్రమే కాకుండా సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించి హిట్స్ అందుకున్నారు.

అయితే, ఇటీవల కాలంలో కాస్త రాజశేఖర్ జోరు తగ్గింది. హీరోగా ఆయనకి బాగా గాప్ వస్తోంది. తల్లితండ్రుల వారసత్వాన్ని తమ కూతుళ్ళకి ఇచ్చారు. ఇద్దరినీ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దొరసాని సినిమాతో ఒకరు పరిచయమైతే మరో సినిమాతో ఇంకో అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. కృష్ణవంశీ లాంటి పెద్ద దర్శకుడు రూపొందిస్తున్న నట సామ్రాట్ లాంటి భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్ల తాకిడికి శివాత్మిక, శివానీ తట్టుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎంతైనా ముంబై హీరోయిన్ల దూకుడు మామూలుగా ఉండదు. బికినీ షూట్స్ దగ్గర్నుంచి లిప్ లాక్స్ వరకూ అవసరానికి మించి రెచ్చిపోతుంటారు. కానీ, శివాని – శివాత్మిక అలా దూసుకెళ్ళే పరిస్థితి లేదనే చెప్పాలి. జీవిత కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడలా తన కూతుళ్ళు చేయకుండా కంప్లీట్ గ్లామర్ రోల్స్ చేస్తే ఇండస్ట్రీలోని నోళ్ళే రక రకాలుగా మాట్లాడుకుంటాయి. ఇక నెటిజన్స్, బయట జనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందుకే, ఫొటో షూట్స్ వరకూ ఒకే గానీ, గ్లామర్ రోల్స్ అంటే జీవితరాజశేఖర్ పిల్లలు కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ, అలా ఉంటే ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఈ విషయం వాళ్ళ కెరీర్ గ్రాఫ్ చూస్తేనే అర్థమవుతోంది. ఇవన్నీ బేరీజు వేసుకొనే సినిమాలకంటే కూడా శివాని – శివాత్మికలకి వెబ్ సిరీస్ చాలా బెటర్ అని సలహాలిస్తున్నారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారేమో చూడాలి. ఏదేమైనా ఈ అక్కాచెల్లెల్లు హీరోయిన్స్‌గా నిలబడతారా అనేది కాస్త సందేహమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news