Moviesపూజా హెగ్డే కి బలిసిందా..? అంత చులకనా..!!

పూజా హెగ్డే కి బలిసిందా..? అంత చులకనా..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే.. ప్రజెంట్ వరస ప్లాప్ సినిమాలతో సతమతమవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ కెరియర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి ..నానా తంటాలు పడ్డింది. పూజా హెగ్డే ఆ తర్వాత అనుకొని ఊహించిన విధంగా సూపర్ సక్సెస్ అయి బిగ్ బిగ్ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు నిర్మాతలకి లాభాలు పంట పండించింది . దీంతో నిర్మాతల పాలిట పూజా హెగ్డే దేవతల మారిపోయింది.

వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే కి అనుకోని బ్రేక్ వేసింది రాధే శ్యామ్. అప్పటివరకు అన్ని సినిమాలు హిట్ కొట్టిన పూజ ..పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా మాత్రం బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన బీస్ట్.. ఆ తర్వాత వచ్చిన ఆచార్య ..ఒకదానిమీద ఒకటి భారీ డిజాస్టర్ గా టాక్ తెచ్చుకోవడంతో.. సినీ ఇండస్ట్రీలో పూజ హెగ్డే గ్రాఫ్ డౌన్ అయింది. దీనితో పూజ హెగ్డే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కాగా పూజ హెగ్డే సినిమాలు చేస్తున్న టైంలోనే స్టార్ ప్రొడ్యూసర్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించే అవకాశం కల్పించారట. కానీ పూజా హెగ్డే వెబ్ సిరీస్ అంటే ఫామ్ లో లేని హీరోయిన్స్ చేసేవి ..ఫామ్ లో ఉన్న వాళ్ళు చేసేది సినిమాలు అంటూ సరదాగా చెప్పుకొచ్చిందట . అంతేకాదు వెబ్ సిరీస్ రిజెక్ట్ చేసి పక్కన పడేసిందట .ఆ టైంలో స్టార్ ప్రొడ్యూసర్స్..” పూజ హెగ్డే కి బాగా బలిసింది.. వెబ్ సిరీస్ అంటే అంత చులకన.. స్టార్ హీరోయిన్ సమంత ,బిగ్ స్టార్స్ ప్రియాంక చోప్రా కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వాళ్లకు లేని డిమాండ్ ఈ పూజకా” అంటూ తిట్టుకున్నారట. సీన్ చేస్తే ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కూడా పూజ హెగ్డే కి ఆఫర్లు ఇవ్వట్లేదు. అంతలా పూజా గ్రాఫ్ పడిపోయింది. మరి చూడాలి పడిపోయిన తన గ్రాఫ్ ని ఎలా లేపుతుందో ఈ పూజా పాప..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news