Moviesపవన్ కళ్యాణ్ చెప్పాడనే ' ఖుషి ' సినిమాలో హీరోయిన్ మీద...

పవన్ కళ్యాణ్ చెప్పాడనే ‘ ఖుషి ‘ సినిమాలో హీరోయిన్ మీద అలా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ హిట్ సాధించిన సినిమాలలో ఖుషి ఒకటి. ఈ సినిమా టాలీవుడ్‌లో సృష్ఠించిన సంచలనం అంతా ఇంతా కాదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సుస్వాగతం, గోకులంలో సీత, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన సినిమా ఖుషి. ఈ సినిమాకు తమిళ దర్శక నటుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు.

ఇదే సినిమా తమిళ, హిందీ భాషలలో కూడా రూపొందింది. కానీ, తెలుగులో సాధించిన భారీ హిట్ తమిళంలో అందుకోలేదు. ఇక హిందీలో ఫ్లాప్ సినిమాగా మిగిలింది. తెలుగులో రికార్డులు క్రియేట్ చేయడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. భూమిక గ్లామర్. అలాగే, మణిశర్మ మ్యూజిక్ అని చెప్పాలి. ఆ సమయంలో అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమాలో సీన్స్, సాంగ్స్ యూట్యూబ్‌లో పవన్ అభిమానులు, ప్రేక్షకులు తిప్పుతూనే ఉంటారు.

 

అయితే, భూమిక మీద తీసిన సాంగ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో..ముంతాజ్ మీద తెరకెక్కించిన మాస్ సాంగ్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి దర్శకుడు ఎస్ జె సూర్య ఈ స్పెషల్ సాంగ్ గురించి చెప్పినప్పుడు ఎవరు చేస్తారు ఈ సాంగ్ అని అడిగారట. అప్పుడు సూర్య ముంతాజ్ అని చెప్పారు. అలాగే, ఈ పాటను ఎవరితో రాయిస్తున్నారు అని అడిగారు.

Kushi Movie | Holi Holi Video Song | Pawan Kalyan, Bhoomika - YouTube

సుద్దాల అశోజ్ తేజ అని చెప్పారు. దాంతో పవన్ కలవమని చెప్పారట. సుద్దాల వచ్చి పవన్ తో కూర్చోగానే ఆయన పాటల గురించి రాసిన విధానం గురించి మెచ్చుకున్నారట పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఖుషిలో ఉన్న గజ్జే ఘల్లుమన్నాదిరో పాట నామీద గానీ, అమ్మాయి మీద గానీ, సినిమా కథ మీద గానీ, ఉండకూడదని సలహా ఇచ్చారట.

అయినా పాట మాత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పవన్ అన్నారట. దాంతో చాలా జాగ్రత్తగా పవన్ సూచన మేరకు ఎక్కడా అసభ్యపదజాలం లేకుండా అద్భుతంగా పాట రాశారు అశోక్ తేజ. ఆ లిరిక్స్ విన్న పవన్ ఆయనను మెచ్చుకున్నారు. ఆ పాట ఇప్పుడు విన్నా కూడా మాస్ ఆడియన్స్‌లో మంచి ఊపుతెస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news