MoviesLIger: ఆ రెండు సీన్లు ఉండి ఉంటే..విజయ్ దేవరకొండకి ఆస్కార్...

LIger: ఆ రెండు సీన్లు ఉండి ఉంటే..విజయ్ దేవరకొండకి ఆస్కార్ కన్ఫామ్..!?

లైగర్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. ఈ సినిమాపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవం అందుకోవడానికి ఆశపడ్డాడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దానికి కారణాలు మెయిన్ కథ డైరెక్షన్ అంటున్నారు జనాలు.

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ . నిజం చెప్పాలంటే ఈయన నటన ఈ సినిమాలో అద్భుతం. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసిన జనాలు ఇప్పుడు లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ని చూస్తే ఆ అర్జున్ రెడ్డి నేనా ఈ లైగర్ అంటూ షాక్ అవడం ఖాయం. అంతలా తనలోని నటనను అభిమానులకు చూపించాడు విజయ్. టంగ్ పవర్ తో నోటికి వచ్చిన డైలాగ్స్ చెప్పిన ఆ అర్జున్ రెడ్డి లైగర్ మూవీలో మాత్రం నత్తి వాడిగా నటించి.. నటుడు అంటే ఏ రోల్ నైనా పోషించాలి అన్న మాటను మరోసారి గుర్తు చేశాడు హీరో విజయ్ దేవరకొండ . ఆ విషయంలో ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

అఫ్కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ దేవరకొండ ను చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే .సినిమా ఫ్లాప్ అయింది ఆయన మాట కారణంగా కాదు. డైరెక్షన్ బాగోలేనందువల్ల .సినిమా చూసిన ప్రతి ఒక్కరూ విజయ్ దేవరకొండ నటన సూపర్ అని మెచ్చుకున్న వాళ్ళే . కానీ కొందరు మాత్రమే సినిమా ఫ్లాప్ అయిన కారణంగా ఆయనను ట్రోల్ చేస్తున్నారు .అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో మెయిన్ రెండు సీన్స్ చాలా ఖర్చు పెట్టి ఎమోషనల్ గా ప్రాణం పెట్టి డైరెక్ట్ చేశారట పూరి జగన్నాథ్ . కానీ అదే సీన్లను సెన్సార్ వాళ్ళు కట్ చేసేసారు .దీంతో సినిమాకు భారీ దెబ్బ పడిందని అంటున్నారు సినీ ప్రముఖులు.

ఆ రెండు సీన్లు ఏవంటే.. ఒకటి విజయ్ దేవరకొండ రమ్యకృష్ణ మధ్య వచ్చే అమ్మ కొడుకుల ఎమోషనల్ సీన్స్. ఈ సీన్ లో విజయ్ దేవరకొండ నిజంగానే ఏడ్చేసినట్టు అప్పుడు షూటింగ్ టైంలో మనం వార్తలు విన్నాం. అంత బాగా ఈ సినిమా లో నటించాడు విజయ్ దేవరకొండ. అదే విధంగా మరొక సీన్ అనన్య పాండేతో. తాను ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసింది అనే భావనలో విజయ్ దేవరకొండ మాట్లాడిన బూతు పదాలు నిజజీవితంలో ఏ అబ్బాయి అయినా సరే తనను అమ్మాయి మోసం చేస్తే అలానే మాట్లాడుతాడు . ఆ ఎమోషనల్ సీన్ చాలా బాగా కుదిరిందని ..కానీ ఆ సీన్లలల్లో ఒకే ఒక్క బూతు పదం ఉన్న కారణంగా సెన్సార్ వాళ్ళు కట్ చెప్పారని ..ఆ రెండు సీన్లు సినిమాకి హైలెట్ గా ఉండేవని అంటున్నారు .అంతేకాదు ఆ సీన్స్ కానీ ఉండుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండకు నటనపరంగా ఆస్కార్ వచ్చేది అని విజయ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news