Moviesమహేష్, నాగ చైతన్యను నమ్మి మోసపోయిన ఆ స్టార్ హీరోయిన్‌...!

మహేష్, నాగ చైతన్యను నమ్మి మోసపోయిన ఆ స్టార్ హీరోయిన్‌…!

కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యేటప్పుడు ఏ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారో చూసుకుంటారు. ఒకవేళ పెద్ద హీరో పెద్ద దర్శకుడు అయితే, మొదటి సినిమాకు రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా నటించ‌డానికి ఒకే అంటారు. అలా ఒకే చెప్పిన హీరోయిన్ కృతి సనన్. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది.

అయితే, కథ, స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా ట్రై చేసిన సుకుమార్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. పెద్దగా ఈ సినిమా ఎవరికీ నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే అర్థం కాలేదని చెప్పాలి. సుకుమార్ అసలే లెక్కల ప్రకారం కథ, స్క్రీన్ ప్లేను రాసుకుంటాడు. కాని, అవి జనాలకి అర్థం కావు. 1 నేనొక్కడినే సినిమా విషయంలో ఇదే జరిగింది. చాలా క్లాస్‌గా ఉన్నా కూడా సినిమా హై రేంజ్‌లో ఆలోచించేవారికే తప్ప కామన్ ఆడియన్స్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి ఎక్కలేదు.

దాంతో ఈ సినిమాతో పరిచయమైన కృతి సనన్ మొదటి సినిమాతో ఘోరమైన ఫ్లాప్‌ను చూసింది. మహేష్ సినిమాతో పరిచయమైన కూడా కాస్త కూడా క్రేజ్ దక్కలేదు. మ‌హేష్ సినిమా అన‌గానే ఆమె క‌థ గురించి ప‌ట్టించుకోకుండా వ‌న్ సినిమా చేసేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఎంత అందంగా ఉన్నా.. టాలెంట్ ఉన్నా కూడా కృతిని స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు ప‌ట్టించుకోలేదు.

ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో అవకాశం అందుకుంది. అప్పట్కే చైతు హీరోగా మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు. పైగా అక్కినేని హీరో. నాగ చైతన్య సరసన నటించి హిట్ అందుకుంటే సెటిలవుతుందని ఆశపడింది. తీరా చూస్తే, నాగ చైతన్య సరసన నటించిన దోచేయ్ సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇలా ఇద్దరు స్టార్స్‌ని నమ్ముకుంటే కృతి సనన్‌కి ఒక్క సినిమాతో కూడా హిట్ దక్కలేదు.

దాంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు. మళ్ళీ ప్రభాస్‌ని నమ్మి ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఇది రామాయణ ఇథిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా వ‌స్తోంది. ఒకవేళ ఆదిపురుష్ గనక హిట్ అయితే, సౌత్‌లో పాన్ ఇండియా లెవల్‌లో హిట్ అందుకొని క్రేజ్ తెచ్చుకుంటుంది కృతి సనన్. లేదంటే ఇక బాలీవుడ్‌కే పరిమితం కావాల్సిందే.doh

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news